Begin typing your search above and press return to search.
కేసీఆర్ చేసింది బాబు ఎందుకు చేయలేరు?
By: Tupaki Desk | 21 Nov 2016 7:44 AM GMTనోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోకుండా ఏపీ సీఎం చంద్రబాబు సంతృష్టకర రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విమర్శించారు. నోట్ల రద్దుపై కనీసం సమీక్ష చేయకుండా కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అద్భుతం - చారిత్రాత్మకం అని పొగుడుతూ కాలక్షేపం చేస్తుండటం బాబుకు చెల్లిందని రామచంద్రయ్య దుయ్యబట్టారు. సీఎం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండడంతో పది రోజులుగా రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. బ్యాంకుల నుంచి నగదు తీసుకునే వీలు లేకపోవడంతో చేతికొచ్చిన ఖరీఫ్ పంటల కోతలకు, రబీకి సన్నద్ధం కావడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దు వల్ల తమ రాష్ట్రానికి ఎదురైన ఇబ్బందులను ప్రధాని మోడీకి వివరించారని, ఆయన మాదిరిగా చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారని రామచంద్రయ్య ప్రశ్నించారు. నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాష్ట్రానికి జరిగే నష్టంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పేదలకు ఉపాధి కరువైందని, బ్యాంకులు - ఏటీఎంల ముందు క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చొని అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా నోట్లు రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పొల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోట్లు రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే నోట్లు రద్దు చేసినందు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెండు వేల నోట్లు వల్ల ప్రజల కష్టాలు తీరడంలేదన్నారు. చిల్లర ఎక్కడ దొరకడంలేదని విమర్శించారు. రెండు వేల నోట్లును వెంటనే రద్దు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. వంద నోట్లను మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నల్లధనం నియంత్రణ కోసం రద్దు చేశామని చెబుతున్న మోడీ మాట ప్రజలను మాయ చేయడానికేనన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/