Begin typing your search above and press return to search.
ఆ సమావేశం నిర్వహించే అర్హత ఉందా?
By: Tupaki Desk | 6 Feb 2017 10:24 AM GMTఆంధ్రప్రదేశ్ లో నిర్వహించనున్న మహిళా పార్లమెంటు సమావేశాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా విపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం ఈ మహిళా పార్లమెంట్ సభ్యులతో జాతీయ సదస్సు నిర్వహించడంపై మండిపడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి - మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ స్త్రీలను వేధిస్తున్న టీడీపీ నేతలు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలతో జాతీయ సదస్సును నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ పాలనలో మహిళకు రక్షణ లేకుండా పోతోందని పేర్కొంటూ ఇందుకు ఎన్నో సంఘటనలు ఉదాహరణ అని వివరించారు. తహశీల్దార్ వనజాక్షిపై సాక్షాత్తు అధికార పార్టీ విప్ దాడిచేయడం, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తెపై మంత్రి అనుచరుల దాడి, కేబినెట్ మంత్రి మనుషుల నుంచి ప్రాణహాని ఉందని గుంటూరు జెడ్పీ చైర్మన్ జానీమూన్ ఫిర్యాదు చేయడం వంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయడం మహిళలను మోసం చేయడమేనని వెల్లంపల్లి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా మహిళలపై వేధింపులను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు మహిళలు - ఉద్యోగినులను వేధించడం లాంటి ఫిర్యాదుల జాబితాలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు - అచ్చెన్నాయుడు ఉన్నారని ఎడిఆర్ విడుదల చేసిన నివేదిక కాపీని ఈ సందర్భంగా విలేకర్లకు చూపించారు.
శాసన మండలి పక్షనేత సి.రామచంద్రయ్య సైతం ఈ సదస్సును తప్పుపట్టారు. రాష్ట్రంలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహించేందుకు సీఎం - స్పీకర్ లకు ఏ నైతిక హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు పార్లమెంటరీ నిబంధనల గురించి ఏ విధంగా దేశానికి దిశానిర్దేశం చేసే సదస్సును నిర్వహిస్తారని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఎన్నికలు ఏవి వచ్చిన పిరాయింపులకు ప్రోత్సాహం ఇస్తున్న చంద్రబాబు ఈ క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాలనే అపహాస్యం చేశారని మండిపడ్డారు. తిరిగి ఆయనే జాతీయ సదస్సు నిర్వహించడం అంటే అంతకంటే వింత ఏముంటుందని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/