Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు సీఆర్ కొత్త పేర్లు పెట్టారబ్బా!
By: Tupaki Desk | 4 Oct 2019 12:48 PM GMTవైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించని రోజంటూ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదేమో. జగన్ అడుగులను చాలా కీన్ గానే పరిశీలిస్తూ వస్తున్న చంద్రబాబు.. ఆయా సందర్భాలను బట్టి జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తిరుమల వెంకన్నకు బ్రహ్మోత్సవాల వేళ సీఎం హోదాలో జగన్ పట్టు వస్త్రాలను సమర్పించిన వైనం పైనా బాబు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఒకప్పుడు టీడీపీలోనే కొనసాగిన ప్రస్తుత వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య ఓ రేంజిలో ఫైర్ కావడంతో పాటుగా చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టేశారనే చెప్పాలి. చంద్రబాబును 40 ఏళ్ల విష వృక్షంగానే కాకుండా విష సంస్కృతికి మర్రి విత్తనంగా పోల్చిన సీఆర్ వ్యాఖ్యలు నిజంగానే సంచలనంగా మారాయని చెప్పక తప్పదు.
క్రైస్తవుడైన జగన్ హిందువుల దేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు ఎలా సమర్పిస్తారన్నది బాబు ఆరోపణ కాగా... జగన్ క్రైస్తవుడైనా అన్ని మతాల దేవుళ్లను గౌరవిస్తారని, అయినా సీఎం హోదాలో స్వామి వారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తే తప్పేంటని సీఆర్ టీడీపీ అధినేతను నిలదీశారు. జగన్ క్రైస్తవుడు అయినా... అన్ని మతాలను గౌరవించడమే కాకుండా... ఆలయ మర్యాదల ప్రకారమే నడుచుకుంటారని కూడా సీఆర్ చెప్పారు. జగన్ గతంలో తిరుమలకు వెళ్లారని, ఇప్పుడూ వెళ్లారని - భవిష్యత్తులో కూడా ఆయన తిరుమలకు వెళ్లి తీరతారని కూడా సీఆర్ వైసీపీ అధినేత వైఖరిని సుస్పష్టంగానే వినిపించారని చెప్పక తప్పదు. అయినా ఆలయ మర్యాదలను పాటించారా? లేదా? అన్న విషయాన్ని చూడాలి గానీ... సంతకం పెట్టారా? లేదా? అన్నది అనవసర విషయమని కూడా సీఆర్ చెప్పుకొచ్చారు.
ఇక ఆలయాలపై టీడీపీ హయాంలో జరిగిన కొన్ని ముఖ్య ఘటలను ప్రస్తావించిన సీఆర్... చంద్రబాబు వైఖరిని కడిగిపారేశారు. టీడీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సదావర్తి భూముల విక్రయం సందర్భంగా పెద్ద స్కామ్ కే పాల్పడ్డారని రామచంద్రయ్య ఆరోపించారు. విజయవాడలో ఏకంగా 40 ఆలయాలను కూల్చిన చరిత్ర టీడీపీదేనని కూడా ఆయన ధ్వజమెత్తారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ భూములను చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెట్టారని కూడా సీఆర్ విమర్శించారు. అమ్మవారి కిరీటం మాయమైంది కూడా చంద్రబాబు పాలనలోనేనని ఆయన గుర్తు చేశారు. దుర్గ గుడితో పాటు శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్ర పూజలు చేయించింది కూడా చంద్రబాబేనని కూడా సీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాల విషయంలో ఇన్ని దురాగతాలకు పాల్పడ్డ చంద్రబాబు నీచ సంస్కృతికి మర్రి విత్తనం లాంటివాడని సీఆర్ ఘాటు వ్యాఖ్య చేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... 40 ఏళ్ల విషవృక్షమని రామచంద్రయ్య తనదైన శైలి వ్యాఖ్యలు సంధించారు.