Begin typing your search above and press return to search.

కోటి సభ్యత్వం అంటే ఇదేనా చినబాబు

By:  Tupaki Desk   |   2 April 2017 5:37 AM GMT
కోటి సభ్యత్వం అంటే ఇదేనా చినబాబు
X
చెప్పుకునే గొప్పలకు.. అసలు వాస్తవాలకు మధ్య అంతరం ఎంతలా ఉంటుందన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ముచ్చటలోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తాజా ఉదంతాన్ని చూస్తే.. చంద్రబాబే కాదు.. ఆయన పుత్రరత్నం.. మరికాసేపట్లో మంత్రిగా ప్రమాణం చేసే లోకేశ్ విషయంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంటుంది. లోకేశ్ ను ఎమ్మెల్సీ చేయటానికి.. ఆయనకు మంత్రి పదవిని ఇప్పించటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. పార్టీకి.. పార్టీ కార్యకర్తల విషయంలో ఆయన చేసిన సేవగా చెబుతారు.

పార్టీ కార్యకర్తలకు లోకేశ్ చేసిన సేవ ఏమిటన్నది కాసేపు పక్కన పెట్టి.. పార్టీకి ఆయన చేసిన సేవ మీద ఫోకస్ చేస్తే.. రికార్డు స్థాయిలో కోటిమందిని పార్టీ సభ్యులుగా చేర్పించారని.. ఆ విషయంలో చినబాబు సాధించిన విజయమే ఆయన్ను మంత్రిగా ఎంపిక చేయటానికి కారణంగా నిలిచిందన్న మాటను తెలుగు తమ్ముళ్లు పదే పదే ప్రస్తావిస్తుంటారు.

నిజంగానే కోటిమందికి టీడీపీ సభ్యత్వం కల్పించటంలో చినబాబు సక్సెస్ అయ్యారా? అంటే.. ఇప్పటికే వెలుగు చూసిన వాస్తవాలు.. తాజాగా బయటకు వచ్చిన అంశాలు చూస్తే.. లోకేశ్ సామర్థ్యం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది. కడప జిల్లాలో టీడీపీ సభ్యత్వంలో చోటు చేసుకున్న చిన్నెలు చూస్తేనే.. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంత ఫార్సుగాసాగిందో ఇట్టే అర్థమవుతుంది.

టీడీపీ సభ్యత్వ ప్రక్రియ డొల్లతనాన్ని రట్టు చేసే ఉదంతాలకు చూస్తే.. ఏపీలో సుపరిచితుడైన సీనియర్ రాజకీయ నేత సి. రామచంద్రయ్యగా చెప్పాలి. 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారో తెలీదు కానీ.. ఆయనకు టీడీపీ సభ్యత్వాన్నిజారీ చేస్తూ ఒక కార్డును ఇష్యూ కావటం గమనార్హం. 2016 నుంచి 2018 వరకు టీడీపీ సభ్యత్వం ఇచ్చినట్లుగా జారీ చేసిన దాన్లో.. ఆయన ఫోటో కూడా ఉండటం విశేషం.

సి. రామచంద్రయ్యలాంటి పేరు ప్రఖ్యాతులున్న నాయకులకు టీడీపీ సభ్యత్వం ఇచ్చేసిన చినబాబు అండ్ కో.. పనిలో పనిగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లకు.. చిన్న నాయకుల పేరిట సభ్యత్వాన్ని ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది.అంతేనా.. పార్టీలకు దూరంగా ఉండే జర్నలిస్టులకు కూడా పార్టీ సభ్యత్వాన్ని కట్టిపారేశారు. ఇలా ఎలా?అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఓటర్ల జాబితానుపక్కన పెట్టేసుకొని..పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చేయటమే ఇలాంటివాటికి కారణంగా చెబుతున్నారు. మరి.. ఈ తరహాలో సభ్యత్వాల్ని ఇచ్చిన ది గ్రేట్ చినబాబును మంత్రివర్గంలో చేర్చుకోవటం అంటే..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/