Begin typing your search above and press return to search.

రామ‌చంద్ర‌య్య దారి జ‌గ‌న్ దారి

By:  Tupaki Desk   |   10 Nov 2018 8:53 AM GMT
రామ‌చంద్ర‌య్య దారి జ‌గ‌న్ దారి
X
క‌డ‌ప‌లో కాంగ్రెస్‌-టీడీపీ- జ‌న‌సేన మూడు పార్టీల‌కు పెద్ద ఝ‌ల‌క్ త‌గిలింది. తెలుగుదేశంతో కాంగ్రెస్ క‌ల‌వ‌డాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని సి.రామ‌చంద్ర‌య్య ఆ పార్టీకి మొన్న త‌క్ష‌ణ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా. అలాంటి పార్టీతో క‌లిసి ఉండ‌మ‌ని రాహుల్‌ గాంధీ చెప్ప‌డం అంటే అది కాంగ్రెస్ సిద్ధాంతానికే విరుద్ధం. రాష్ట్ర పాల‌న‌లో తీవ్రంగా విఫ‌ల‌మైన తెలుగుదేశంతో కాంగ్రెస్ క‌లిస్తే కాంగ్రెస్ మ‌రింత ప‌త‌నం అవుతుంది. అందుకే ఈ పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకించారు రామ‌చంద్ర‌య్య‌.

అయితే, రాజీనామా అనంత‌రం ఆయ‌న జ‌న‌సేన‌లో చేర‌తార‌ని అంద‌రూ భావించారు. కానీ తాను ప్ర‌జ‌ల కోసం పాటుప‌డుతున్న జ‌గ‌న్‌ తో క‌లిసి న‌డ‌వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. సోమ‌వారం నుంచి పాద‌యాత్ర తిరిగి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ నెల 13న బొబ్బిలిలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రామచంద్రయ్య వైసీపీలో చేర‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పు చేసినా - త‌ప్పుచేసినా క్ష‌మించాం కానీ... ప్ర‌జ‌లకు విరుద్ధంగా ప‌నిచేస్తామంటే అక్క‌డ ఉండ‌లేమ‌ని... అందుకే ప్ర‌జా విధానాల‌కు అనుగుణంగా ప‌నిచేసే వైసీపీతో క‌లిసి న‌డుస్తామ‌ని రామ‌చంద్ర‌య్య చెప్పారు.

ఇక తెలుగుదేశం- కాంగ్రెస్ పొత్తుతో తెలుగుదేశం శ్రేణులు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ‌తాయి అనుకుంటే... కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ పొత్తును వ్య‌తిరేకిస్తున్నాయి. ఇంత‌కాలం ఎవ‌రితో పోరాడామో వారితోనే దోస్తీ చేయ‌డానికి మ‌న‌సు ఎలా అంగీక‌రిస్తోంద‌ని కాంగ్రెస్ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. అందుకే పార్టీలోని ప్రధాన నాయకులంతా హస్తానికి గుడ్‌ బై చెబుతున్నారు.