Begin typing your search above and press return to search.

జగన్ సమక్షంలో వైసీపీలోకి సి.రామచంద్రయ్య

By:  Tupaki Desk   |   13 Nov 2018 8:03 AM GMT
జగన్ సమక్షంలో వైసీపీలోకి సి.రామచంద్రయ్య
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం జగన్ పాదయాత్రలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సాదరంగా ఆహ్వానించిన జగన్ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.

పార్టీలో చేరిన అనంతరం మాజీ మంత్రి సి.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. గవర్నర్ వ్యవస్ధను కూడా చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇటువంటి వారిని దూరంగా పెట్టాలి’’ అని అన్నారు.

‘‘కాంగ్రెస్ తో పొత్తుపై రామచంద్రయ్య వ్యాఖ్యానిస్తూ ‘‘ ఏ భావాలతో టీడీపీ పుట్టిందో అది ఇప్పుడు లేదు. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని దేశంలో చక్రం తిప్పుతానని చంద్రబాబు కలలు కంటున్నారు. ’’ అని రామచంద్రయ్య రుసరుసలాడారు.

చిరంజీవి స్థాపించిన పీఆర్పీలో కీలక పాత్ర పోషించిన రామచంద్రయ్య.. చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలపడంతో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదని - ఆయన ఎవరితోనైనా కలుస్తారని విమర్శించారు. చంద్రబాబు అవకాశ రాజకీయాలను సమర్థించాల్సిన అవసరం ఏంటని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబుతో రాహుల్ పొత్తుపెట్టుకోవడం దారుణమన్నారు.

సీనియర్ మంత్రి అయిన రామచంద్రయ్య చేరికతో ఉత్తారాంధ్రలో వైసీపీకి బలం పెరిగిందని ఆ పార్టీల నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటున్నారు. రాహుల్ నిర్ణయంపై మరింత మంది కాంగ్రెస్ నేతలు తొందరలోనే పార్టీ వీడే అవకాశాలు కనబడుతున్నాయి.