Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ను వీడి.. జనసేనలోకి ఈ సీనియర్..

By:  Tupaki Desk   |   9 Oct 2018 5:33 AM GMT
కాంగ్రెస్ ను వీడి.. జనసేనలోకి ఈ సీనియర్..
X
ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఆయన ఏకంగా శాసనమండలి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత.. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చాక కనుమరుగైపోయారు. గతంలో తెలుగుదేశంలో పనిచేసి.. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. అనంతరం చిరు కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడంతో ఆయనతోపే హస్తం గూటికి చేరారు. విలీన సమయంలోనే ఈయనకు ఎమ్మెల్సీ పదవిని చిరంజీవి ఇప్పించారు. ఆ పదవీకాలం ఇటీవలే ముగిసింది. దీంతో ఇప్పుడాయన ఉన్న కాంగ్రెస్ ను - కాంగ్రెస్ దోస్తీ చేస్తున్న టీడీపీని కాదని జనసేనలోకి వెళ్లబోతున్నారట. ఇంతకీ ఎవరాయన అంటే సి. రామచంద్రయ్య..

రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. దీంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు రాంచంద్రయ్య అవుతున్నాడట.. అందుకే అధికార చంద్రబాబును తెగ తిడుతున్నారు.. మారిన దేశ రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్-తెలుగుదేశం ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ దిగ్గజ నేతలు రఘువీరారెడ్డి, శైలజానాథ్ లాంటి వాళ్లు గతంలో చంద్రబాబును బాగా తిట్టారు. కానీ ఇప్పుడు బాబుపై మాట జారడం లేదు. కానీ సి.రామచంద్రయ్య మాత్రం బాబు పాలనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు..

రామచంద్రయ్య వైఖరి చూశాక ఆయన బాబుతో, ఉన్న కాంగ్రెస్ లో ఉండడం ఇష్టలేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా రాంచంద్రయ్య చూపు జనసేన మీద పడ్డట్టు వార్తలొస్తున్నాయి. రామచంద్రయ్య కుల సమీకరణాలు కూడా కాపు సామాజికవర్గ పవన్ కే సపోర్ట్ గా నిలుస్తున్నాయి..

రాయలసీమలోని బలిజలు ఆది నుంచి చిరంజీవిని - పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రామచంద్రయ్య బలిజ సామాజికవర్గమే కావడంతో ఆయన టీడీపీ - కాంగ్రెస్ కంటే జనసేన వైపే మొగ్గు చూపుతున్నారట.. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జనసేనలోకి ఆయన చేరిక లాంఛనమే అంటున్నారు..