Begin typing your search above and press return to search.

సీఏఏతో ముస్లింల ప‌రిస్థితేమిటో తేల్చేసిన ఐరాస‌!

By:  Tupaki Desk   |   20 Feb 2020 1:31 PM GMT
సీఏఏతో ముస్లింల ప‌రిస్థితేమిటో తేల్చేసిన ఐరాస‌!
X
ఎన్నార్సీ - ఎన్‌ పీఆర్‌ - సీఏఏల‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు జ‌ర‌గుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అక్ర‌మ చొర‌బాటుదారుల ఏరివేత‌కే సీఏఏ అమ‌లు చేస్తున్నామ‌ని - సీఏఏ వ‌ల్ల భార‌తీయ ముస్లింల‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని కేంద్రం చెబుతోంది. అయితే, కేవలం మ‌త ప్రాతిప‌దిక‌న పౌర‌స‌త్వం ఇవ్వ‌డం రాజ్యాంగ‌విరుద్ధ‌మ‌ని సీఏఏని వ్య‌తిరేకించేవారు వాదిస్తున్నారు. మ‌త ప్రాదిప‌దిక‌న దేశాన్ని విడ‌గొట్టాల‌ని మోడీ స‌ర్కార్ యోచిస్తోంద‌ని ముస్లింలు వాదిస్తుండ‌గా.....కేవ‌లం అక్ర‌మ చొర‌బాటుదారుల‌ను ఏరివేయ‌డానికే ఈ చ‌ట్టం తెచ్చామ‌ని, దీని వ‌ల్ల భార‌తీయ ముస్లింల‌కు ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌ని కేంద్రం వాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఏఏకు వ్య‌తిరేకంగా ఐక్యరాజ్యసమితి కూడా ఒక లెజిస్లేటివ్ రిపోర్టును విడుదల చేసింది.

సీఏఏ, ఎన్నార్సీల‌పై ప‌లు ప్ర‌పంచ దేశాలు వ్య‌తిరేకత వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ జాబితాలో తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితి చేరింది. సీఏఏ ముస్లిం సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ ప్రకటన విడుదల చేసింది. బీజేపీకి ఆయువుప‌ట్టువంటి హిందూత్వ భావజాలం నుంచి సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు పుట్టుకొచ్చాయని పేర్కొంది. సీఏఏ - ఎన్నార్సీల అమ‌లుతో దేశంలో ముస్లింల‌కు చోటుండ‌క‌పోవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింల‌ను ఎన్‌ ఆర్‌ సీ నుంచి తొలగించడం - సుదీర్ఘంగా నిర్బంధంలో ఉంచ‌డం వంటి ప‌రిణామాలు ఉండ‌వ‌చ్చిన అభిప్రాయ‌ప‌డింది. త‌మ నివేదిక‌కు ఊత‌మిచ్చేలా బీజేపీ నేత‌లు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ఈ నివేదికలో పొందుపర్చింది.

అమెరికా కాంగ్రెస్ సభ్యులు అమిబెరా - జార్జ్ హోల్డింగ్‌ లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్ష్ శ్రింగ్లాను కలిసి ఈ నివేదిక గురించి చర్చించారు. ప్రభుత్వానికి ఐరాస నివేదిక‌ను చేరవేయాలని హర్ష్ శ్రింగ్లాను వారు కోరినట్లు తెలుస్తోంది. హిందూత్వ రాజకీయాలనుంచే ఎన్నార్సీ వ‌చ్చింద‌ని చెప్పేందుకు కొన్ని ఉదాహరణలను ఐరాస‌ ప్రస్తావించింది. ఈ శతాబ్దం హిందూత్వ శతాబ్దమని భారత్‌ లో ఇతర మతస్తులకు చోటు లేకుండా చేస్తామని యోగీ ఆదిత్యనాథ్ 2005లో చేసిన వ్యాఖ్యలను ఐరాస‌ ప్రస్తావించింది. భార‌తీయ ముస్లింల‌కు సీఏఏ, ఎన్నార్సీలు ప్ర‌తిబంధంకంగా మారాయ‌ని, వీటివ‌ల్ల‌ ఆ సామాజిక వర్గం వారికి నష్టంతో పాటు కష్టంక‌లుగుతుంద‌ని ఆందోళ‌న ఐరాస చెందింది.