Begin typing your search above and press return to search.

ఈ శనివారం ఎక్కడకు ప్లాన్ చేసుకోమాకండి

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:41 AM GMT
ఈ శనివారం ఎక్కడకు ప్లాన్ చేసుకోమాకండి
X
గడిచిన పద్నాలుగు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అంతకంతకూ పెరుగుతోంది. శనివారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. వివిధ సంఘాలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి. తాజాగా ఈ బంద్ నకు ఓలా.. ఊబర్ సంస్థలకు చెందిన కార్ డ్రైవర్ల జేఏసీ కూడా తమ మద్దతును ప్రకటించాయి.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల సాధనకు తామూ మద్దతు ఇస్తామంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ బంద్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ భావిస్తోంది. తాము చేస్తున్న సమ్మెతో ప్రభుత్వం మీద ఒత్తిడిని మరింత పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ శనివారం (అక్టోబరు 19) మిగిలిన వారితో పాటు హైదరాబాదీయులు బయటకు వెళ్లే ప్రోగ్రాం వీలైనంత తక్కువ పెట్టుకుంటే మంచిదన్న సూచన వినిపిస్తోంది. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లు దాదాపుగా 50వేల మంది ఉండటాన్ని మర్చిపోకూడదు.

సమ్మె నేపథ్యంలో మెట్రో రైలు.. కొన్ని ఆర్టీసీ బస్సులు మినహా మిగిలిన రవాణా సౌకర్యాలు ఉండవన్న మాట వినిపిస్తోంది. ఈ రోజు సాయంత్రానికి ఆటో డ్రైవర్లు కూడా బంద్ కు తమ మద్దతు తెలిపే వీలుందని.. అదే జరిగితే..సొంత వాహనాలు ఉన్న వారు తప్పించి.. మిగిలిన వారు బయటకు వస్తే బుక్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.