Begin typing your search above and press return to search.

జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనకి కేబినెట్ ఆమోదం

By:  Tupaki Desk   |   28 Nov 2019 10:05 AM GMT
జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనకి కేబినెట్ ఆమోదం
X
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి భాద్యతలు తీసుకున్నప్పటి నుండి ..పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా సీఎం అమలు పరుస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలని అమలుపరుస్తున్న. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలతో పాటుగా ..ఇవ్వని హామీలని కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద చదువుకునే ప్రతీ విద్యార్థికి మెస్‌ చార్జెస్‌ కింద నగదు అందజేయనున్నారు. ఐటీఐ చదువుతున్న వారికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదువుతున్న వారికి సంవత్సరానికి రూ. 15 వేలు, డిగ్రీ నుంచి ఉన్నత చదువులకు సంవత్సరానికి రూ. 20 వేలు అందించేందుకు కేబినెట్‌ ఆమోదం. జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఏటా రూ. 3400 కోట్లు ఇవ్వడానికి మంత్రి మండలి ఆమోదించింది. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ రెండు పథకాలతో రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయిన తాను ఇష్టపడే కోర్స్ లో జాయిన్ అయ్యి మంచిగా చదువుకునేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇకపోతే , పది ఎకరాల లోపు మాగాణి లేదా 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి లేదా ఈ రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్న వారికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకం వర్తిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది అని కూడా ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల మెస్ ఛార్జీలకు ఇచ్చే డబ్బుని ప్రతి ఏటా జూన్ నెలలో 50 శాతం , ఆ తర్వాత డిసెంబర్ నెలలో మిగతా 50 శాతం మొత్తం 100 శాతం విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అని తెలిపారు.