Begin typing your search above and press return to search.

ఆ మూడు ఎయిర్ పోర్టులు అదానీ గూటికే చేరాయిగా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 3:45 AM GMT
ఆ మూడు ఎయిర్ పోర్టులు అదానీ గూటికే చేరాయిగా?
X
చూస్తున్నంతనే తిరుగులేనంతగా దూసుకెళుతున్న అదానీల చేతికి తాజాగా దేశీయంగా మరో మూడు ఎయిర్ పోర్టుల్ని నిర్వహించే అవకాశం లభించింది. ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్య విధానంలో మూడు విమానాశ్రయాల్ని లీజుకు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇప్పటికే లక్నో.. అహ్మదాబాద్.. మంగళూరు విమానాశ్రయాల్ని గత ఏడాది ఫిబ్రవరిలోనే ఈ గ్రూపు సొంతం చేసుకుంది.తాజాగా.. జైపూర్.. తిరువనంతపురం.. గువాహటి విమాశ్రాయాల్ని అదానీ చేతికి అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు.

దీంతో అదానీ చేతిలో మొత్తం ఆరు విమానాశ్రాయాలు ఉన్నట్లు అవుతుంది. ఈ ఆరింటి నిర్వహణను అదానీ సొంతం చేసుకున్నప్పటికి.. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ వాటిని ఎయిర్పోర్టు అథారిటీకి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. తాజాగా అదానీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న మూడు ఎయిర్ పోర్టులు (జైపూర్.. గువాహటి.. తిరువనంతపురం) యాభై ఏళ్ పరిమిత కాలానికి మాత్రమే కంపెనీకి అప్పగిస్తారు.

తాజా పరిణామంతో మరింత నాణ్యమైన సేవల్ని ప్రయాణికులకు అందించే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఎయిర్ పోర్టు అథారిటీకి ఈ డీల్ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. లీజు ప్రారంభంలోనే ఎయిర్ పోర్టు అథారిటీకి రూ.1070 కోట్ల మొత్తం చెల్లించనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ మూడు ఎయిర్ పోర్టుల్ని ఈ ఏడాది నవంబరు 12 లోపు స్వాధీనం చేసుకునే వెసులుబాటు ఉంది.