Begin typing your search above and press return to search.

సరోగసి బిల్లుకు ఆమోదం.. షరతులివే

By:  Tupaki Desk   |   27 Feb 2020 12:22 PM GMT
సరోగసి బిల్లుకు ఆమోదం.. షరతులివే
X
పిల్లలు లేక సతమతమయ్యే వారు అద్దె గర్భాల ద్వారా పిల్లలను కనే పద్ధతే ‘సరోగసి’ విధానం. పేద మహిళలను ఆసరాగా చేసుకొని డబ్బున్న వారు తమ పిల్లలను కంటుంటారు. బాలీవుడ్ హీరోలు షారుక్, అమీర్ ఖాన్, నిర్మాత కరణ్ జోహర్ లాంటి వారు ఇలానే పిల్లలను కన్నారు. అయితే ఇన్నాల్లు విధానం అంటూ లేని ఈ సరోగసికి తాజాగా కేంద్రం బిల్లు ద్వారా చట్టం చేసింది.

సరోగసి బిల్లు-2020కి తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ బిల్లు సరోగసి ద్వారా తల్లులు కాబోయే మహిళలకు వరం కానుంది. వింతతువులకు , విడాకులు తీసుకున్న మహిళలకు, బిడ్డలకోసం అల్లాడే దంపతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. కమర్షియల్ గా సరోగసి విధానాన్ని ఈ బిల్లు నిషేధించిందని తెలిపారు. భారతీయ జంటలు మాత్రమే ఈ సరోగసి ద్వారా పిల్లలను కనేలా నిబంధనలు విధించినట్టు తెలిపారు. ఇక ఈ సరోగేట్ తల్లికి 36 నెలలు ఇన్సూరెన్సు వర్తింపచేయనున్నట్టు తెలిపారు.