Begin typing your search above and press return to search.
జగన్ కేబినెట్‌లో చోటు కోసం.. తహతహ.. ఎవరంటే!
By: Tupaki Desk | 31 March 2022 4:30 AM GMTఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం సిద్ధమైంది. ఇప్పటికే కొత్త నేతల జాబితా కూడా రెడీ అయినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్‌ను కలిసేందుకు అప్పాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. అయినప్పటికీ.. ఇంత జరుగుతున్నా.. మంత్రి వర్గంలో తమకంటే.. తమకు చోటు కావాలంటూ.. తాడేపల్లి చుట్టూ.. కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడం.. గమనార్హం. పైగా.. జగన్ అత్యంత కీలకంగా భావించే సామాజిక వర్గం కూడా కావడం విశేషం.
వారే కమ్మ సామాజిక వర్గానికి.. చెందిన ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కూడా! గత 2019 ఎన్నికల తర్వాత.. ఏర్పాటు చేసుకున్న మంత్రి వర్గంలో.. జగన్.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అవకాశం ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి ఒకే ఒక్క సీటు ఇచ్చారు. కాపులకు మూడు బెర్త్‌లు ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కొడాలి నానిని కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన వల్లకొంత ప్లస్ ఉన్నా.. పార్టీకి ఆయన సేవలు అవసరమని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పైగా.. కృష్ణాజిల్లాను విభజించడం ద్వారా.. ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిని మాత్రం తప్పించడం ఖాయమని..కొన్నాళ్లుగా ప్రచారం అయితే.. జరుగుతోంది. ఈ క్రమంలోనే నలుగురు నాయకులు ఈ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. వీరిలో కృష్నాజిల్లాకే చెందిన(విభజన తర్వాత కూడా గన్నవరం కృష్ణాజిల్లాలోనే ఉంటుంది) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ కూడా టీడీపీ తరఫున గెలిచి.. వైసీపీకి మద్దతుగా మారారు. మరి వీరినిమంత్రులుగా తీసుకుం టారా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు.. వీరితో పాటు కృష్ణా జిల్లా నుంచి వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ తలశీల రఘురాంలు కూడా.. మంత్రి పదవుల రేసులో కమ్మ వర్గం నుంచి ముందున్నారు.
అయితే.. వీరిలో చంద్రబాబుకు, ఆయన పార్టీకి దూకుడుగా చెక్ పెడతారో చూసుకుని.. వారికి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లేదు.. సీనియర్ నాయకుడు.. కరణం బలరాంకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా... కమ్మ కోటాలో బెర్త్ కోసం.. జంపింగులు కూడా ప్రయత్నించడం.. చర్చగా మారింది.