Begin typing your search above and press return to search.

ట్రింగ్..ట్రింగ్ మోగట్లేదా.. అదే సంకేతమా..?

By:  Tupaki Desk   |   4 April 2022 2:30 AM GMT
ట్రింగ్..ట్రింగ్ మోగట్లేదా.. అదే సంకేతమా..?
X
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఇపుడు హాట్ హాట్ టాపిక్ గా ఉంది. దాదాపుగా డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేలు తమ రాజకీయ అదృష్టాన్ని అలా పరీక్షించుకుంటున్నారు. ఎవరికి కుర్చీ అన్న రేసులో వారు యధాశక్తిగా పాల్గొంటున్నారు. ఈ విషయంలో ఎవరిని కలవాలో వారిని కలసి వస్తున్నారు.

మరో వైపు తమ ఇష్ట దైవాలను ప్రార్ధించుకుంటున్నారు. గుళ్ళూ గోపురాలను దర్శించుకుంటున్నారు. ఇదంతా మంత్రి పదవి కోసమే అన్న సంగతి తెలిసిందే. ఇక కొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వారి విషయంలో సీన్ వేరుగా ఉంది. తమకు ఏమైనా సంకేతాలు వస్తే వారు వెళ్ళి కలిసేది ఉంటుంది.

అలా కాకుండా అనవసరంగా వెళ్ళి యాగీ చేసుకున్నా సుఖం లేదన్నది రాజకీయంగా తలపండిన వారి ఆలోచనగా ఉంది. అయితే ఇలాంటి సీనియర్ నేతల ఫోన్లు ట్రింగ్ ట్రింగ్ అని ఎక్కడా మోగడంలేదుట. అంటే వారికి అధినాయకత్వం వైపు నుంచి సిగ్నల్స్ రావడంలేదు అనే దీని అర్ధం అంటున్నారు.

ఒకవేళ తమ పేరు ఏ దశలో అయినా పరిశీలనలో ఉంటే తప్పకుండా ఫోన్ టచ్ లోకి వస్తారు కదా అని వారు లెక్కలేసుకుంటున్నారు. కొత్త మంత్రివర్గానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ ఇప్పటిదాకా తమ ఫోన్లు ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉన్నాయీ అనుకుంటే ఆశలు పెద్దగా లేనట్లే అని వారికి వారే ఫిక్స్ అయిపోతున్నారుట.

ఇక వైసీపీలో చూసుకుంటే అధినాయకత్వం తీరు వేరుగా ఉంటుందని చెబుతారు. పదవులు ఇవ్వాలనుకుంటున్న వారికి హింట్ అందుతుంది. లేదు అనుకుంటున్న వారికి తమ ఎదురుగా పదే పదే కనిపించి వారు ఆయాసపడకుండా తమను ప్రయాస పెట్టకుండా ఒక్క మాటలోనే తేల్చేస్తారు అని కూడా చెబుతారు. గతసారి మంత్రివగం కూర్పులో ఒక సీనియర్ నేతకు ఇదే అనుభవం ఎదురైంది అంటున్నారు.

అన్నా మీకు చాన్స్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఆయన గాబరాను ఆదిలోనే తగ్గించేశారని టాక్. ఇపుడు చూసినా సీన్ అలాగే ఉంది. అనవసరంగా ఈ టైమ్ లో ఎవరికి ఫోన్ చేసినా అది వారి ఆశను పెంచినట్లు అవుతుందని కొందరికి ఏ పని అయినా ఫోన్లే చేయడంలేదు అంటున్నారు. అలా సీనియర్లుగా ఉంటూ మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న వారికి మాత్రం మోగని ఫోన్ రూపంలో నిరాశే ఎదురవుతోందని అంటున్నారు.

ఇక వైసీపీలో సీనియర్లుగా ఉన్న నేతలలో తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రాయలసీమలోని పలువురు సీనియర్లు ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని సీనియర్ నేతలు ఉన్నారు. వీరంతా మంత్రి పదవి ఆశతో ఉన్నా హై కమాండ్ నుంచి ఆ దిశగా సిగ్నల్స్ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.