Begin typing your search above and press return to search.
జగన్ తోనే జీవితం...అయినా పదవులకు దూరం...?
By: Tupaki Desk | 11 April 2022 3:30 AM GMTజగన్ అన్న మూడు అక్షరాలను తారకమంత్రంగా జపిస్తూ ఆయన వెంట నడిచి ఆయన్ని నమ్మిన వారికి ఇపుడు మొండి చేయి చూపించారు అన్న మాట గట్టిగా ఉంది. జగన్ విషయానికి వస్తే మాట తప్పను, మడప తిప్పను అంటారు. కానీ సొంత పార్టీ వారే ఇపుడు ఆ స్లోగన్ మీద సెటైర్లు వేస్తున్నారు. మాట తప్పుతున్నారని, మడప కూడా తిప్పుతున్నారని వారు ఫైర్ అవుతున్నారు.
వైసీపీలో చేరిన వారంతా నాడు ఏ పదవులూ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలలో కానీ అనుభవించని వారే. పైగా వారంతా ఫ్రెష్ గా రాజకీయం కొత్త పార్టీ నుంచి మొదలెడదామని అనుకున్నారు. జగన్ వంటి యువకుడు పొలిటికల్ గా తమను గుర్తిస్తారు అని వారు భావించారు.
అయితే జగన్ మాత్రం వారికి ఉత్త చేతులు చూపించారు అని మధనపడుతున్నారు. కనీ వినీ ఎరగని మెజారిటీ జగన్ కి 2019 ఎన్నికల్లో వచ్చింది అంటే దానికి కారణం ఆయన వెంట ఉన్న కొండంత అండ లాంటి క్యాడర్, లీడర్లే అంటున్నారు. ఇపుడు అలాంటి లీడర్లు పార్టీ పవర్లో ఉంటే తమకు కూడా కలసివస్తుందని భావిస్తారు.
మంత్రి పదవులు తాము కూడా అనుభవించాలి అని తలపోస్తారు. కానీ ఇపుడు అలాంటి వారి ఆశలు అడియాశలే అయ్యాయి. జగన్ పదవులు దగ్గరకు వచ్చేసరికి బయట వారికే ప్రాముఖ్యత ఇచ్చారని వారు నిందిస్తున్నారు. విడదల రజనీ లాంటి వారు అవకాశవాద రాజకీయాలతో తమ పార్టీలో చేరితే వారిని అందలం ఎక్కించడం ఎంతవరకూ సబబు అని వారు నిలదీస్తున్నారు.
మరో వైపు చూస్తే సీనియర్ నేతల పేరిట ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి వారికి మరిన్ని సార్లు పదవులు కట్టబెట్టడం అంటే వైసీపీలో ఆది నుంచి ఉన్న వారికి అన్యాయం చేసినట్లే అన్న మాట కూడా ఉంది. కాంగ్రెస్ లో బొత్స, ధర్మాన పదవులు అనుభవించిన వారే అని గుర్తు చేస్తున్నారు.
ఇక జగన్ ని నమ్మి నడచిన వారిలో రెడ్డి సామాజికవర్గం పూర్తిగా నష్టపోయింది అని వారు బాధపడుతున్నారు. ఏ పార్టీలోనూ, ఆ మాటకు వస్తే వారి రాజకీయ జీవితంలో ఇంత పెద్ద దెబ్బ ఎపుడూ ఎదురుకాలేదని కూడా చింతిస్తున్నారు. అలాంటి వారి జాబితాలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి వంటి వారు ఉన్నారు.
ఈ నేతలు అంతా తమ పరిస్థితి ఇపుడు ఏంటి అని ఆలోచించుకునే సీన్ ఏర్పడింది. నిజానికి వీరంతా సమర్ధులైన నేతలు. పార్టీ పవర్ లోకి వస్తే తామే మంత్రులము అవుతామని ఆశపడ్డారు కూడా. కానీ సోషల్ ఇంజనీరింగ్ పేరిట వీరి ఆశలు గల్లంతు చేశారు. ఇక మరో వైపు చూస్తే బీసీలలో కూడా సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు.
వారిలో క్రిష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్ధసారధి వంటి వారు ముందు వరసలో ఉంటారు. కానీ వారికి ఏ రకమైన పదవులు ఇవ్వలేదు అని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణ పైన సీనియర్లతో పాటు అంతా రగులుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.