Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ 2.0 : నాని పోయే రోజా వచ్చే ఢాం ఢాం ఢాం

By:  Tupaki Desk   |   11 April 2022 4:33 PM GMT
జ‌గ‌న్ 2.0 : నాని పోయే రోజా వచ్చే ఢాం ఢాం ఢాం
X
క్యాబినెట్ విస్త‌ర‌ణ లేదా పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అనే ప్ర‌క్రియ స‌జావుగానే పూర్త‌యింది. అనుకున్న స‌మ‌యానికి అనుకున్న విధంగానే చాలా మంది ఉత్కంఠ‌కు తెర దించుతూ గ‌వ‌ర్న‌ర్ నేతృత్వంలో ఈ కార్య‌క్ర‌మం అత్యంత హుందాగా సాగింది.వైసీపీ స‌ర్కారు హ‌యాంలో నిజాయితీ చెప్పాలంటే ఇంత హుందాగా సాగిన కార్య‌క్ర‌మం గ‌డిచిన మూడేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదు. స‌భ‌లో ఎలానూ వాళ్లూ వీళ్లూ బూతులు తిట్టుకుంటుంటారు.

ఆ సంగ‌తి ఎలానూ తెలిసిందే! కానీ బ‌య‌ట కూడా అదేవిధంగా మీడియా మైకుల ఎదుట బూతుల పురాణం వినిపించే మంత్రుల‌కు ఆంధ్రావ‌ని లో కొద‌వ‌లేదు. అస‌లు తిడితేనే మీడియాలో తాము హైలెట్ అవుతాము అని అనుకునే బాప‌తు మ‌నుషులు మ‌రియు మంత్రులు ఎంద‌రో ఉన్నారు. అందుకే టీడీపీ కొన్ని సార్లు వెర్బ‌ల్ ఎటాక్ ఇచ్చేందుకు కూడా భ‌య‌ప‌డిపోతోంది. స‌భ‌లో కూడా అన్ రికార్డెడ్ వెర్షన్ లో చాలా బూతులు ఉంటాయ‌ని అవి మ‌న‌కు వినిపించ‌వ‌ని ఆ మ‌ధ్య ఉండ‌వ‌ల్లి లాంటి నాయ‌కులు చెప్పార‌న్న సంగ‌తి ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.

ఇక బూతుల మంత్రి అయిన కొడాలి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నానికి గౌర‌వంగానే ప‌దవి నుంచి త‌ప్పించి అప్ప‌టిక‌ప్పుడు డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పేరిట ఓ ప‌దవి ఇచ్చి సంతృప్తం చేశారు. ఇదే విష‌య‌మై ఆయ‌న్ను అడిగితే తాను ప‌ద‌వుల కోసం లేన‌ని, పార్టీ కోసం ముఖ్యంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విధేయుడిగా ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతూనే, ఇవాళ కూడా మీడియా ఎదుట మ‌రోసారి చంద్ర‌బాబు ను నోటికి వ‌చ్చిన విధంగా తిట్టారు.

ఇక ఇంత‌కాలం కొడాలి నాని ఎంతో స‌మ‌ర్థంగా చంద్ర‌బాబును మ‌రియు లోకేశ్ బాబును ఎదుర్కొన్నారు. వారి స్థానంలో ఇప్పుడు రోజా వ‌చ్చారు అని అంటున్నారు. ఆమెకు టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ అప్ప‌గించారు. ఎంతో కాలంగా ప‌ద‌వి కోసం
వెంప‌ర్లాడుతూ అధినేత జ‌గ‌న‌న్న వెంట‌ప‌డుతూ వ‌స్తున్న రోజాకు ఒక్క‌సారి ప‌దవి రావ‌డం రాష్ట్రం అంతా ఆశ్చ‌ర్య‌పోతోంది.

నివ్వెర పోతుంది అని కూడా రాయాలి.ఎందుకంటే ఆమెకు గ‌తంలో ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వి అప్ప‌గించారు. రెండేళ్ల ప‌ద‌వీ కాలంలో ఆమె సాధించింది ఏమీ లేదు. అప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను గౌతం రెడ్డి చూస్తుండ‌డంతో, ఆయ‌న హ‌యాంలోనే ఈ విభాగం కూడా ఉండ‌డంతో రోజా పెద్ద‌గా క్రియాశీల‌కం అయింది లేదు. ఇదే స‌మ‌యంలో ఆమె ఇటుగా ఉండ‌కుండా జ‌బ‌ర్ద‌స్త్ లాంటి టెలివిజ‌న్ షోల‌కు ఎక్కువ కాలం వెచ్చించ‌డంతో ఏపీఐఐసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఆమెకు అలంకార ప్రాయం అయింది.

ఆ త‌రువాత ప‌రిణామాల నేప‌థ్యంలో పెద్డిరెడ్డితో అనేక‌సార్లు త‌గువు ప‌డ్డారు. బాహాటంగానే ఆమె బాహాబాహీకి దిగారు. ఈ వాగ్యుద్ధాన్ని డిప్యూటీ సీఎం అయిన నారాయ‌ణ స్వామి (పెద్దిరెడ్డి శిష్యుడు) తోనూ కొనసాగించారు.దీంతో టీడీపీ వ‌ర్గీయులను కొంద‌రిని తెలివిగా రోజా పైకి ఉసిగొల్పారు పెద్దిరెడ్డి. ఇంత‌టి వాగ్యుద్ధంలోనూ జ‌గ‌న్ త‌ల‌దూర్చ‌లేదు. తీర్పు చెప్ప‌లేదు. ఈ పరిణాలు ఇలా ఉంటుండ‌గానే జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లోనూ రోజా మాట నెగ్గ‌లేదు. ఆమె ప్రాతినిధ్యం వ‌హించే న‌గ‌రి నియోజ‌వ‌ర్గంలో కొంత భాగం తిరుప‌తి జిల్లాలో, కొంత భాగం చిత్తూరులో ఉండిపోయింది.
ఆవిధంగా కాకుండా ప‌రిపాల‌న సౌల‌భ్యం, ప్ర‌జాభీష్టం మేర‌కు తిరుప‌తి జిల్లాలోనే న‌గ‌రిని ఉంచాల‌న్న డిమాండ్ ను కూడా జ‌గ‌న్ వినిపించుకోలేదు. ఇన్ని అనుకూల‌తల మ‌ధ్య రోజా ఇవాళ రెండు జిల్లాల మంత్రిగా వాసికెక్కారు. ఇక ఆమె యుద్ధం చంద్ర‌బాబుపై కొన సాగిస్తారా లేదా ? అన్న‌ది చూడాలి. పాత కోపంతో ఎప్ప‌టికిప్పుడు ఊగిపోయే కొడాలి నాని మాదిరిగానే రోజా కూడా అసెంబ్లీలో టీడీపీ బాస్ చంద్ర‌బాబు ను టార్గెట్ చేస్తారా? ఒక‌వేళ ఆయ‌న స‌భ‌కు రాక‌పోయినా మీడియా ఎదుట అయినా జగ‌న‌న్న కోరిక మేర‌కు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల‌ను ఢీ కొంటారా అన్న‌ది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో ఇవాళ అత్యంత ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ.