Begin typing your search above and press return to search.

ఇక.. 24 గంటలూ థియేటర్లలో షో వేసుకోవచ్చు

By:  Tupaki Desk   |   29 Jun 2016 4:18 PM GMT
ఇక.. 24 గంటలూ థియేటర్లలో షో వేసుకోవచ్చు
X
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొన్ని ముఖ్యమైన వాణిజ్య రంగాలకు సంబంధించిన 24 గంటల పాటు పని చేసేందుకు వీలుగా అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సినిమా థియేటర్లు.. స్టోర్లు.. రెస్టారెంట్లు.. బ్యాంకులు ఇతర వ్యాపారాలు పగలూ.. రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటలూ నిర్వహించొచ్చంటూ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో కొన్ని మార్పులు.. చేర్పులకు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం భారీ ఉత్పత్తి సంస్థలు.. సర్వీసు సెక్టార్ కు సంబంధించి సంస్థలు మాత్రమే 24 గంటలూ తెరిచి ఉంచే అవకాశం ఉంది. ఇకపై.. తాజాగా నిర్ణయం తీసుకున్న రంగాలు కూడా రోజు మొత్తం పని చేసే వీలుంది. చట్టరూపంగా మారిన తర్వాత.. నాన్ స్టాప్ గా 24 గంటలూ థియేటర్లలో షో వేసుకునే అవకాశం అధికారికంగా లభించినట్లే. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్ లలో ఏర్పాటు చేయనున్న మినీ థియేటర్లకు పండగే పండగ్గా చెప్పొచ్చు. ఇక.. నగరాల్లోని మల్టీఫ్లెక్స్ లకు కూడా ఈ నిర్ణయం లాభించే వీలుంది.