Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో టీవీలు కూడా చూడ‌నివ్వ‌రా?

By:  Tupaki Desk   |   16 July 2015 7:33 AM GMT
హైద‌రాబాద్‌లో టీవీలు కూడా చూడ‌నివ్వ‌రా?
X
హైద‌రాబాద్‌లో టీవీలు కూడా చూడ‌నివ్వ‌రా? అంటూ హైద‌రాబాద్ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అదేంటి ప్ర‌భుత్వం ఆ విధంగా ఏదైనా నిర్ణ‌యం తీసుకుందా? ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచే టెలివిజ‌న్‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం ఏంటి? అది క‌రెక్టు కాదు క‌దా అనుకోకండి. అస‌లు విష‌యం వేరే ఉంది.

హైద‌రాబాద్‌లో దాదాపు 30ల‌క్ష‌ల టీవీ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. ఇందులో 25ల‌క్ష‌లు కేబుల్ క‌నెక్ష‌న్లు కాగా...మిగ‌తావి డిష్ టీవీల ద్వారా న‌డుస్తున్న‌వి. ప్ర‌స్తుతం కేబుల్ టీవీల‌కు నెల‌కు ప్రాంతాన్ని బట్టి రూ.150 నుంచి 200 వ‌సూలు చేస్తున్నారు. అయితే వ‌చ్చే నెల‌నుంచి ఒక్కో క‌నెక్ష‌న్‌కు రూ.600 వ‌సూలు చేయాలంటూ ఎంఎస్ఓల నుంచి త‌మ‌కు ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని కేబుల్ అప‌రేటర్లు వాపోతున్నారు. ఇంత‌కీ ఇంత భారీ స్థాయిలో పెంపు అవ‌స‌రం ఏముంది అంటే...అస‌లు మ‌ర్మం చెప్తున్నారు. కేబుల్ టీవీల డిజిట‌లైజేష‌న్‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వం క్రియాశీలంగా అడుగులు వేస్తున్ననేప‌థ్యంలో ఆ ప్ర‌క్రియ‌ను అడ్డుపెట్టుకొని కొన్ని ఎంఎస్ఓలు ధ‌ర‌ల పెంపున‌కు ఎత్తులు వేశార‌ని వివ‌రిస్తున్నారు.

అయితే ఇంత భారీగా చార్జీలు పెంచ‌డం అంటే...వినియోగ‌దారులు త‌మ కేబుల్ క‌నెక్ష‌న్ల‌ను ప‌క్క‌న పెట్టి డిష్ టీవీల వైపు ఆక‌ర్షితులు అయ్యేందుకు రెడీ చేయ‌డమేన‌ని కేబుల్ ఆప‌రేట‌ర్లు వాపోతున్నారు. ఆయా చానెల్లు, ఎంఎస్ఓలు క‌లిసి కుట్ర‌లు చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ధ‌ర‌ల పెంపును త‌ప్ప‌నిస‌రి చేస్తే తాము గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

నిత్యావ‌స‌ర ఖాతాలో ఎప్పుడో చేరిపోయిన టీవీల‌పై బాదుడు ఉంటుందా...ప్ర‌స్తుత చార్జీలే కొన‌సాగుతాయా అనేది తెలియాలంటే... వేచిచూడాల్సిందే.