Begin typing your search above and press return to search.
కాఫీడే యజమాని మృతి...కన్నడిగుల సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 3 Aug 2019 10:15 AM GMTకేఫ్ కాఫీ డే వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్దార్థ మృతిచెందడంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మందిని కలచివేసిన సంగతి తెలిసిందే. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక ఆయన అదృశ్యమవడం, అనంతరం కన్నుమూయడంతో కాఫీడే సంస్థ షేర్లపై ఒత్తిడి పడింది. సిద్ధార్థ అదృశ్యంతోనే ఆ కంపెనీ షేర్లు 20శాతం తగ్గిపోయాయి. దీంతో లోయర్ సర్క్యూట్ మార్కు అయిన 154.05కు తాకింది. ఆ మరుసటి రోజు సైతం అదే రీతిలో ట్రెండ్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ విషయంలో కన్నడిగులు కీలక నిర్ణయ తీసుకున్నారు. నష్టాల బాట పట్టిన కేఫ్ కాఫీ డే కంపెనీని ఆదుకోవాలని వాటి షేర్లు కొనుగోలు చెయ్యడానికి కన్నడిగులు, మలెనాడు ప్రజలు ముందుకు వచ్చారు.
కన్నడ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తిగానే కాకుండా గొప్ప వ్యక్తిగా కూడా సిద్ధార్థ గుర్తింపు పొందారు. కర్ణాటకలోని మలెనాడుకు చెందిన సిద్ధార్థ తాను గొప్ప స్థాయికి చేరిన తర్వాత మలెనాడుకు చెందిన వేలాది మంది యువకులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించిన సిద్దార్థ వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఇదే సమయంలో సిద్ధార్థ స్ఫూర్తితో అనేకమంది వ్యాపారాల్లో రాణించారు. వారంతా ఇప్పుడు కేఫ్ కాఫీడేను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు. నష్టాల్లో ఉన్న కాఫీ డే షేర్లు కొనుగోలు చెయ్యడానికి మనం సిద్దం కావాలంటూ మలెనాడు ప్రజలు, సిద్దార్థ అభిమానులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. దీంతో ఈ పిలుపునకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన వచ్చింది. మలెనాడు ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న కన్నడిగులు భారీగా కాఫీ డే షేర్లు కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా మలెనాడుకు చెందిన వ్యక్తులే కాఫీ డే సంస్థ షేర్లు కొనుగోలు చేస్తున్నారని వివరాలను బట్టి స్పష్టమవుతోంది.
సిద్ధార్థ తమ దేవుడని మలెనాడు ప్రజలు పేర్కొంటుండటం గమనార్హం. కేఫ్ కాఫీ డేని కాపాడుకోవాలని సిద్దార్థ చివరి వరకు ప్రయత్నించి విఫలం అయ్యారని పేర్కొంటూ, సిద్దార్థ ఆశయాలు కాపాడుకుంటామని, ఆయన ఎంతగానో ప్రేమించిన కాఫీ డే కంపెనీని కాపాడుకుంటామని మలెనాడు యువత స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో నష్టాల్లో ఉన్న కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడుకోవాలంటే మరింత మంది యువకులు వాటి షేర్లు కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావాలని సిద్దార్థ అభిమానులు పిలుపునిస్తున్నారు. `సిద్దార్థ ఆశయాలు, కలలు కాపాడుకోవడం మా భాద్యత, సిద్దార్థ మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు` అని మలెనాడు ప్రజలు ముందుకు వచ్చి షేర్లు కొనుగోలు చేస్తుండటంతో..కేఫ్ షేర్ల ధర పుంజుకుంటోంది.