Begin typing your search above and press return to search.

రైల్వే చార్జీలు మ‌ళ్లీ మోగిపోనున్నాయ్‌

By:  Tupaki Desk   |   12 March 2017 10:41 AM GMT
రైల్వే చార్జీలు మ‌ళ్లీ మోగిపోనున్నాయ్‌
X
రైల్వే చార్జీలు మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిర్వహణా వ్యయాన్ని పూర్తిగా రాబట్టుకునేందుకు రైల్వే చార్జీలను సవరించాలని కాగ్ సూచించింది. అంతేకాదు వికలాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు, పాత్రికేయులు స‌హా వివిధ కేటగిరీల‌కు చెందిన కన్సెషన్ పాసులను తగ్గించాలని కూడా తెలిపింది. ఉత్పాదకతను మెరుగుపర్చాలని, జమా ఖర్చులలో తప్పుడు వర్గీకరణలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కాగ్ నివేదిక పేర్కొంది. మంజూరు లేని వ్యయాన్ని నియంత్రించాలని కూడా తెలిపింది.

ఈ సంద‌ర్భంగా కేంద్రం తీరుపై సైతం ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. సుమారు 200 అభివృద్ధి పథకాల్లో దాదాపు మూడోవంతు వాటికి ప్రజా సంప్రదింపుల విధానంలో అవకతవకలున్నట్టు కాగ్ కనిపెట్టింది. 2011-15 మద్యకాలంలో పర్యావరణ అనుమతులు పొందిన ఈ పథకాల విషయంలో సరైన రీతిలో సంప్రదింపుల విధానం అమలు కాలేదని స్పష్టం చేసింది. పర్యావరణ ప్రభావ అంచనాల నివేదికల్లో కంపెనీలు ఇచ్చే హామీలపై నిఘా వేయడం లేదని, సంప్రదింపుల సందర్భంగా వచ్చే సూచనలను నివేదికలో చేర్చడం లేదని కాగ్ వివరించింది.

ఇదిలాఉండ‌గా ఢిల్లీలోని ఆప్ సర్కారు తొలి ఏడాది పాలనలో తన పరిధిలోకి రాని బయటి ప్రాంతాల్లో అడ్వైర్టెజ్‌మెంట్ల విడుదలకు రూ.29 కోట్లు ఖర్చు చేయడం సరికాదని కాగ్ మందలించింది. ప్రత్యేకించి రూ.24 కోట్ల విలువ చేసే యాడ్‌ ల విడుదల ఆర్థిక జవాబుదారీకి, సుప్రీంకోర్టు నియంత్రణలకు విరుద్ధంగా జరిగిందని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/