Begin typing your search above and press return to search.

తెలుగోళ్ల అప్పుల లెక్కలు తేలినట్లే

By:  Tupaki Desk   |   28 Oct 2015 9:01 AM GMT
తెలుగోళ్ల అప్పుల లెక్కలు తేలినట్లే
X
రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదహారు నెలలు అవుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తేలాల్సిన లెక్కలు ఇప్పటికి తేలని పరిస్థితి. విభజన జరిగిన వెంటనే అన్నీ లెక్కలు తేలిపోతాయని తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ తన సహచరులతో చెప్పేవారు. అయితే.. మాటలు వేరు.. వాస్తవం వేరన్న విషయం.. ఉద్యమ నేతగా మాటలు చెప్పిన కేసీఆర్ కు కూడా ఇప్పటికి బాగానే అర్థమైంది. వ్యవస్థలో మార్పులు ఎంత కష్టమన్న విషయం ఆయనకు స్పష్టంగా అర్థమైంది.

అనుకున్న వెంటనే ఏమీ మారిపోదని.. అందులోకి చట్టపరమైన అంశాలు చాలానే ఉంటాయన్నది తెలిసి వస్తోంది. మిగిలిన విషయాల్ని పక్కన పెడితే.. అప్పుల విషయంలో లెక్క ఇప్పటికే తేలింది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చేసిన అప్పుల్లో రెండు రాష్ట్రాలకు తేల్చే విషయంలో పదహారు నెలలుగా కిందామీదా పడి తన తర్వాత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా తేల్చింది.

2014 జూన్ 2 నాటికి ఏపీ ఉమ్మడి రాష్ట్రం మొత్తం అప్పులు 1, 67, 122 కోట్లుగా నిర్దారించారు. ఈ మొత్తం నేరుగా అప్పులు చేసినవి కాగా.. మరో రూ.18,462 కోట్లు. వీటిని రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉంది. ఈ పనిని కేంద్రం చేయాల్సి ఉంటుంది. అయితే.. కాగ్ తేల్చిన లెక్కను అధికారికంగా చేసుకుంటే.. ఏపీకి రూ.91,122 కోట్లు కాగా.. తెలంగాణకు రూ.77వేల కోట్లకు అప్పులు వచ్చే అవకాశం ఉంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. జనాభా నిష్పత్తిలో ఏపీకి.. తెలంగాణకు అప్పులు విభజించనున్నారు. కాగ్ తేల్చిన లెక్కను కేంద్రం నిర్దారించి.. అధికారికంగా తేల్చాల్సి ఉంది. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తి కానుంది.