Begin typing your search above and press return to search.
కాగ్ ఇంటరెస్టింగ్ రిపోర్ట్ : అప్పుల అప్పారావు జగన్ కాదా....?
By: Tupaki Desk | 20 Jun 2022 8:30 AM GMTఏపీ అంటే అప్పుల మయం అని అంతా అంటారు, విపక్షాలు అయితే తెల్లారి లేచింది మొదలు ఏపీని అప్పుల కుప్ప జగన్ చేశారు అని దుమ్మెత్తిపోతారు. కానీ గడచిన ఆర్ధిక సంవత్సరం అంటే 2021-22లో జగన్ సర్కార్ అప్పులు చాలా పరిమితంగా చేసిందని, ఆర్ధిక క్రమశిక్షణను బాగా పాటించిందని తాజాగా కాగ్ నివేదికలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
ఒక విధంగా ఇది టీడీపీ సహా విపక్షాలకు మింగుడుపడని విషయమే. అయితే కాగ్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాబట్టి ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను నమ్మాల్సిందే. అంతే కాదు ఈ నివేదిక ఇపుడు వైసీపీకి ప్రధాన ఆయుధం కాబోతోంది. రాబోయే రోజుల్లో దీన్ని ముందు పెట్టి వైసీపీ టీడీపీని చెడుగుడు ఆడే సీన్ కూడా ఉంది.
విషయానికి వస్తే 2021-22 ఆర్ధిక సంవస్తరంలో ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ లో 37,029.79 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నట్లుగా పేర్కొంది. కానీ చేసింది మాత్రం 25,194.62 రూపాయలు మాత్రమే అని కాగ్ రిపోర్ట్ పేర్కొంది. అలాగే కాగ్ నివేదిక ప్రకారం చూస్తే తెలంగాణా కర్నాటక రాష్ట్రాలు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అంచనాలకు మించి అప్పులు చేసినట్లుగా పేర్కొంది. గతేడాది తెలంగాణ రూ.47,690.59 కోట్లు, కర్ణాటక రూ.60,486.26 కోట్ల అప్పులు పొందాయని పేర్కొంది.
ఇక ఈ రెండు రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీ కరోనా వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ అంచనాల కంటే తక్కువగానే అప్పులు చేసిందని, పరిమితులు పాటించిందని కాంగ్ వెల్లడించడం విశేషమే. కాగ్ ఒక్క మాటలో తేల్చినది ఏంటి అంటే ఏపీ అప్పు ఇతర రాష్ట్రాల కంటే కూడా గత ఆర్ధిక సంవత్సరం తక్కువే అని.
మరో వైపు చూస్తే ఏపీ ద్రవ్య లోటు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. వల్ల ద్రవ్యలోటు 2.10 శాతానికే పరిమితమైందని, అలాగే రెవెన్యూ లోటును రూ.8,370.51 కోట్లకే పరిమితం చేసిందని కాగ్ వెల్లడించడం కూడా గమనార్హం. ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ఆదాయం కూడా బాగా పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది.
అంతే కాదు, ఒక వైపు ప్రత్యక్ష నగదు బదిలీ కింద వివిధ పధకాల కింద ఖర్చు చేస్తూ ఏపీ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించడం జరిగింది అని దాని వల్లనే ఆదాయాలు పెరిగాయని ఏపీ ఆర్ధిక శాఖ దీని మీద విశ్లేషిస్తోంది. మొత్తానికి ఏపీ అప్పుల కుప్ప కాదు, జగన్ అప్పుల అప్పారావు కాదు అని కాగ్ ఇచ్చిన ఈ నివేదిక వేయేనుగుల బలంగా వైసీపీకి ఉంటుందని అంటున్నారు.