Begin typing your search above and press return to search.
చంద్రుడిపై ఇల్లు కట్టుకోవటానికి అయ్యే ఖర్చు లెక్క కట్టారు
By: Tupaki Desk | 22 March 2021 3:15 AM GMTఅక్కడెక్కడో అల్లంత దూరాన ఉంటూ.. అమ్మ జోలపాటలోనూ.. గోరుముద్దల సమయంలో తప్పనిసరిగా వచ్చే చందమామ ఊసు.. ఇటీవల కాలంలో తగ్గిపోయింది. మారిన కాల..మాన పరిస్థితులతో పాటు.. జీవన శైలిలో వచ్చిన మార్పులు కూడా కారణం. రాత్రివేళలో.. పిల్లలకు అన్నం పెట్టటానికి ఆరు బయటకు వచ్చి.. ఆకాశంలో మెరిసే నక్షత్రాల మధ్య అందంగా కనిపించే చంద్రుడ్ని గడిచిన రెండు తరాల వారు చూశారా? కాంక్రీట్ జంగిల్ లో చిక్కుకుపోయి.. కళ్ల ముందుండే రంగుల టీవీని వదిలేసి.. తల పైకెత్తి ఆకాశం వంక చూసి ఎంత కాలమైంది చెప్పండి.
మనల్ని మొదట్నించి ఊరించే చందమామ మీదకు వెళ్లి వచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే. చందమామపైకి వెళ్లిరావటమే కాదు.. అక్కడ ఉండాలంటే ఉండేందుకు వీలుగా కొన్ని ప్రయత్నాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా వీరు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తున్నారు. 2024లో నాసా తన ఆర్టిమిస్ మిషన్ ద్వారా మనుషులను చందమామపైకి పంపటానికి ఏర్పాట్లు చేస్తోంది.. ఈ ప్రయోగాలన్ని విజయవంతమైతే.. చంద్రుడిపైకి వెళ్లి రావటం పెద్ద కష్టం కాబోదు.
ఇదిలా ఉంటే మూన్ మార్టిగేజ్ గైడ్ పేరుతో నిపుణులు ఒక నివేదికను సిద్ధం చేశారు. ఇందులో చందమామపైకి వెళ్లి రావటానికి? అక్కడే నెల రోజులు ఉండి గడపటానికి..? చంద్రుడిపై ఇల్లు కట్టుకోవటానికి ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని లెక్కిస్తూ నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం చంద్రుడిపై మొదటి ఇల్లు కట్టుకోవాలంటే రూ.289.76 కోట్లు అవుతుందని తేల్చారు. అదే సమయంలో నెల రోజులు చందమామపై గడపాలంటే రూ.2.35 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు.
భూమి మీద లాగా చంద్రుడిపైన వాతావరణం లేకపోవటం.. మన వాతావరణానికి అక్కడి వాతావరణంలో తేడా ఉండటం.. ఒత్తిడి తక్కువగా ఉండటంతో. ఇంట్లో ప్రెషర్.. ఆక్సిజన్.. నీళ్లు.. ఇతర సౌకర్యాల్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. కరెంటు కోసం సోలార్ విద్యుత్ ప్యానెళ్ల అవసరం ఉంటుంది. చంద్రుడిపై ఉల్కలు గాల్లో మండిపోకుండా.. నేల మీదకు నేరుగా పడతాయి. అలాంటివాటిని నుంచి రక్షణ పొందేలా గోడలు నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఖర్చు ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అయితే.. రోజులు గడిచే కొద్దీ.. ఈ ఖర్చు మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.