Begin typing your search above and press return to search.
అమిత్ షా యాత్రకు బ్రేక్..అసలు కారణం ఇదే
By: Tupaki Desk | 7 Dec 2018 7:55 AM GMTబీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఊహించని షాక్ తగిలింది. పశ్చిమబెంగాల్ లో ఆయన సారథ్యంలో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి ఇచ్చేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. మత ఉద్రిక్తతలు పెరగవచ్చనే కారణంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు బెంగాల్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా జనరల్ కలకత్తా హైకోర్టుకు తెలియజేశారు. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన అమిత్ షా రథయాత్రకు కూచ్ బిహార్ ఎస్పీ అనుమతి ఇవ్వలేదని కిషోర్ దత్తా కోర్టుకు తెలిపారు. ‘రథయాత్ర వల్ల స్థానికంగా మత ఉద్రిక్తతలు పెరగవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది` అని ఆయన చెప్పారు. దీంతో ఏకీభవించిన కలకత్తా హైకోర్ట్ కూడా రథయాత్రకు అనుమతి నిరాకరించింది.ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ నెల 7 - 9 - 14 తేదీల్లో రథయాత్రలను ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. మొత్తం 42 లోక్ సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చి కోల్ కతాలో ముగించాలని ప్రణాళిక రూపొందించారు. కూచ్ బిహార్ జిల్లాలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూచ్ బిహార్ నుంచి చేపట్టదలచిన రథయాత్రకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాడివేడీగా వాదనలు జరిగాయి. రథయాత్ర సందర్భంగా ఏదైనా అనుకోనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న జడ్జి ప్రశ్నికు - బీజేపీ తరఫు న్యాయవాది అనింద్య మిత్ర శాంతిభద్రతలు కాపాడటమనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని జవాబిచ్చారు. అనుమతి నిరాకరణను సవాల్ చేస్తూ బీజేపీ అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయడంపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు. కొత్త పిటిషన్ గా కానీ - తన పిటిషన్ కు సవరణగా కానీ రావాలి తప్ప అనుబంధ అఫిడవిట్ చెల్లదని ఆయన వాదించారు
కాగా, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ తలపెట్టిన ఈ యాత్ర సంచలనంగానే కాకుండా వివాదాస్పదంగా మారింది. టార్గెట్ కోల్‌కతా అని సాగుతున్న బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 42 లోక్ సభ నియోజక వర్గాలను కవర్ చేస్తూ అమిత్ షా టూర్ ఏర్పాటుచేసింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రంగంలోకి దించాలనుకుంది. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యాత్రలో పాల్గొనేలా చేయాలని స్కెచ్ వేసింది. అయితే, ఈ టూర్ కు మమతా బెనర్జీ ఆదిలోనే బ్రేక్ వేశారు. భద్రత కారణాలతో అనుమతి నిరాకరించారు. అమిత్ షా చేసేది కేవలం రాజకీయ యాత్ర మాత్రమేననీ - ఆయన జగన్నాథుడి కోసమో - లేదా శ్రీకృష్ణుడి కోసమే రథం ఎక్కడం లేదంటూ తన చర్యను ఆమె సమర్థించుకున్నారు.