Begin typing your search above and press return to search.
స్కాం చేసి కోహ్లీ కారు కొన్నాడట!!
By: Tupaki Desk | 29 Oct 2016 10:06 AM GMTఎక్కడో మహారాష్ట్రలోని థానె ప్రాంతంలో ఉండి... అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి సుమారు 500 కోట్ల రూపాయలు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ (23) ఆ డబ్బుతో మంచి విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తుండటం.. ఈ క్రమంలో తన గర్ల్ ఫ్రెండుకు రూ. 2.5 కోట్లు పెట్టి "ఆడి ఆర్ 8" కారును బర్త్ డే బహుమతిగా కొనివ్వడం తెలిసిందే. ఆ కారును థానే పోలీసులు అహ్మదాబాద్ లో సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆ కారుకు సంబందించిన ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... షాగీ కొన్న ఈ ఆడీ కారు విరాట్ కొహ్లీ దంట!
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... గత మే నెలలో కోహ్లీ నుంచి థక్కర్ ఈ కారును కొనుగోలు చేశారని, అయితే షాగీ పాల్పడుతున్న ఈ స్కాం గురించి కోహ్లీకి తెలియక అతనికి విక్రయించాడని థానే పోలీసు కమిషనర్ చెబుతున్నారు. కాల్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే ఈ ఆడీ ఆర్ 8 కారును కొనుగోలుచేశాడని వారు తెలిపారు. అలాగే విచారణలో భాగంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు ప్రకటించిన పోలీసులు... షాగికి హైఎండ్ కార్లంటే చాలా ఇష్టమని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం విరాట్ కోహ్లీ నుంచి ఈ కారును కొన్నాడని చెబుతున్నారు.
కాగా, ముంబైలోని మిరా రోడ్లో ఏడంతుల భవనంలో గత కొంతకాలంగా కాల్ సెంటర్లు నడపుతున్న షాగీ... విదేశీయులకు ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్లమంటూ ఫోన్లు చేస్తూ వారి నుంచి వందల కోట్ల రూపాయలను దోచేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుమారు 6వేల మందికి పైగా అమెరికన్లు తమ సంపాదనను భారీగా కోల్పోయారు. ఈ స్కాం అక్టోబర్ 4న బయటపడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/