Begin typing your search above and press return to search.

కాల్ మ‌నీ క‌థ మొద‌టికి.. టార్గెట్ బెజ‌వాడేనా..?

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 AM GMT
కాల్ మ‌నీ క‌థ మొద‌టికి.. టార్గెట్ బెజ‌వాడేనా..?
X
విజ‌య‌వాడ‌లో రాజ‌కీయం మారుతోంది. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ముందుకు సాగుతోంది. తూర్పు, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పులో విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీ.. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని స్వ‌ల్ప తేడాతో చేజార్చుకుంది.

అయితే.. ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ గ‌ట్టిగా ప‌ట్టు ద‌క్కించుకుంది. మ‌రోవైపు.. ప‌శ్చిమ‌లోనూ ప‌ట్టు సాధించేందుకు టీడీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ నేత‌లు.. వెనుక‌బ‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. పెన‌మ లూరు నియోజ‌క‌వ‌ర్గం లోనూ.. వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. ఇక్క‌డ నుంచి గెలిచిన కొలుసు పార్థ‌సార‌థి త్వ‌ర‌లోనే పార్టీ మారిపోతార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ కొత్త అస్త్రం తెర‌మీదికి తెస్తున్న ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. టీడీపీని బ‌ల‌హీన ప‌రిస్తే.. త‌ప్ప ఇక్క‌డ వైసీపీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపిం చ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పాత కేసులు తిర‌గ‌దోడే వ్యూహాన్ని అనుస‌రించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగా చంద్ర‌బాబు హ‌యాంలో తీవ్ర ర‌చ్చకు దారితీసిన‌,, కాల్ మ‌నీ కేసుల‌ను తిర‌గ‌దోడాల‌ని.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా భావిస్తున్నట్టు గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ కేసుల్లో అప్ప‌ట్లో టీడీపీ నేత‌ల‌పై ప్ర‌ధానంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు కీల‌క నేత‌ల పాత్ర ఉందని.. వైసీపీ నేత‌లు ఆరోపించారు. అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేపిన ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు స‌ర్కారు విచార‌ణ‌కు కూడా ఆదేశించింది.

అయితే.. త‌ర్వాత‌.. ఏమైందో తెలియ‌దు కానీ.. ఇది మ‌రుగున ప‌డింది. కానీ, ఇప్పుడు వైసీపీకి టీడీపీ రాజకీయంగా ప్ర‌తిబంధకంగా మారుతున్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో నేత‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు.. టీడీపీ హ‌వాను త‌ప్పించేందుకు వైసీపీ వ్యూహాత్మ‌కంగా మ‌రోసారి.. కాల్ మ‌నీ కేసును తిర‌గ‌దోడే ప్ర‌య‌త్నంలో ఉంద‌ని.. కీల‌క నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో.. ఏం జ‌రుగుతుందో చూడాలి.