Begin typing your search above and press return to search.
అమరావతిలో కాల్ మనీ కలకలం....
By: Tupaki Desk | 15 Dec 2019 10:04 AM GMTఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్‌మనీ కలకలం ఎంత రచ్చ రచ్చ అయ్యిందో చూశాం. ఈ కాల్‌మనీ కలకలంలో ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీడీపీ నేతల పేర్లు కూడా వార్తల్లో చక్కెర్లు కొట్టాయి. దీనిపై అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ ఓ రేంజ్‌లో పోరాటం చేసింది. ఇక మళ్లీ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో కాల్ మనీ రాకెట్ తీవ్ర కలకలం రేపుతోంది. తాడేపల్లిలో కాల్ మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక వెంకట్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
కాల్ మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వెంకట్ స్టేషన్ ముందే పురుగుల ముందు తాగాడు. కొద్ది రోజులుగా వడ్డీ వ్యాపారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని... దీనిపై పోలీసులకు ఫిర్యదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. వెంకట్ పురుగుల మందు తాగడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
ఇక ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటీవల కాల్ మనీ మళ్లీ విజృంభిస్తోంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు, వలస కార్మికులను టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యాపారులు డైలీ వడ్డీ పేరుతో వారి నుంచి భారీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సైతం వడ్డీ వ్యాపారులు తాను అప్పు మొత్తం కట్టేసినా తన డెబిట్ కార్డు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే ఇక రాజధాని ప్రాంతంలో సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుదో ? అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం, పోలీసులు ఇప్పటకి అయినా కాల్ మనీనీ ఉక్కుపాదంతో అణిచి వేయాల్సిన అవసరం ఉంది.