Begin typing your search above and press return to search.

ఏపీ గవర్నర్ కు ఢిల్లీకి పిలుపు.. తమిళ సై మాటేంది?

By:  Tupaki Desk   |   15 Jun 2021 6:00 PM IST
ఏపీ గవర్నర్ కు ఢిల్లీకి పిలుపు.. తమిళ సై మాటేంది?
X
చాలా రోజులు.. ఆ మాటకు వస్తే చాలా నెలల తర్వాత ఢిల్లీ పెద్దల చూపు తెలుగు రాష్ట్రం మీద పడింది. ఇటీవల చోటు చేసుకున్నరాజకీయ పరిణామాల నేపథ్యంలో.. పిలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ను ఢిల్లీ పెద్దలు పిలిపించాల్సి ఉంది. అనూహ్యంగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి వచ్చి ఉండటం.. ఆ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ అయ్యారు.

సీఎం జగన్ పర్యటన పూర్తి చేసుకొని వచ్చి నాలుగు రోజులు కాక ముందే.. గవర్నర్ కు ఢిల్లీకి రావాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎవరెవరిని కలవనున్నారు? అన్న విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే.. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు.. సీఎం తన ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుకు తీసుకొచ్చిన అంశాల మీద ఫీడ్ బ్యాక్ అడిగే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని భావించారు. దీనికి కారణం లేకపోలేదు. సీఎం కేసీఆర్ మీద పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలు వస్తుండటం.. అధికార పార్టీ నుంచి బీజేపీలోకి సీనియర్ నేత ఈటల రాజేందర్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. మరింత ఫీడ్ బ్యాక్ కోసం ఆమెను కూడా పిలుస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అందుకు భిన్నంగా ఏపీ గవర్నర్ ను మాత్రమే పిలవటం ఆసక్తికరంగా మారింది.