Begin typing your search above and press return to search.
ఆ హైవేలో గంటకు 175 కి.మీ. కొట్టేస్తున్నారట
By: Tupaki Desk | 9 Sep 2016 5:33 AM GMTసిటీ లిమిట్స్ వరకూ కార్లను నడపటం ఎంత నరకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే.. సిటీ లిమిట్స్ దాటి హైవే మీద అడుగుపెట్టిన వెంటనే రెక్కలొచ్చినట్లుగా వాహనాలు రోడ్ల మీద పరుగులు పెడుతుంటాయి. గంటకు 100 నుంచి 150 మధ్యన చెలరేగిపోతూ ప్రయాణిస్తుంటారు. నిజానికి అంత వేగానికి తట్టుకునే సామర్థ్యం హైవే రోడ్లకు లేవు. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా అత్యాధునిక కార్లతో దూసుకెళుంటారు. ఇలాంటప్పుడు జరిగే ప్రమాదాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
హైవేల మీద వాహనాలు ఎంత వేగంగా దూసుకెళుతున్నాయన్న అంశంపై ఫూణెలో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా డ్రోన్ కెమేరాల్ని ఏర్పాటు చేసి.. వాహనాలు ఎంత స్పీడ్ గా వెళుతున్నాయన్న అంశంపై దృష్టిసారించారు. ఈ సందర్భంగా వెల్లడైన వివరాలు షాకింగ్ గా ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 21 గంటల పాటు సీసీ కెమేరాలో రికార్డు అయిన వాహనాల వివరాలు చూసినప్పుడు మొత్తం 4224 వాహనాలకు 4185 వాహనాలు గరిష్ఠ పరిమితిని దాటి వేగంగా వెళ్లటం రికార్డుకావటం గమనార్హం.
ఇదిలా ఉంటే ఒక బీఎండబ్ల్యూ కారు అయితే ఏకంగా గంటకు 175 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లటాన్ని అధికారులు గుర్తించి అవాక్కు అయ్యారు. గంటకు 175 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించిన కారుకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోనప్పటికీ.. అదే రోజు అదే మార్గంలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవటం.. అందులో ఇద్దరు మరణించటం గమనార్హం. హైవేల మీద వేగంగా దూసుకెళ్లటం మామూలే అయినా.. మరీ ఇంత వాయు వేగంతో ప్రయాణం కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది.