Begin typing your search above and press return to search.

మహిళలకు నగలు కాదు.. ఐరన్ ముఖ్యం

By:  Tupaki Desk   |   21 Oct 2019 7:22 AM GMT
మహిళలకు నగలు కాదు.. ఐరన్ ముఖ్యం
X
‘ధన్ తేరస్’ అంటే ధన త్రయోదశి. హిందీలో ఫేమస్ అయిన ఈ పండుగ నాడు అందరూ బంగారం కొంటారు. అయితే డీఎస్ఎం అనే ఓ సంస్థ మహిళలు బంగారం కొనవద్దని పిలుపునిచ్చింది. మహిళలకు కావాల్సింది బంగారం కాదని.. ఐరన్ అని.. ఈ ఐరన్ ను తీసుకోవాలని పిలుపునిచ్చింది.

‘ప్రాజెక్ట్ స్త్రీధన్’ పేరుతో పౌష్టికాహారం - సుస్థిర ఆరోగ్యవంతమైన జీవనం గురించి పనిచే ఈ డీఎస్ ఎం అనే సంస్థ ఓ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఐరన్ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాలను తింటున్న మహిళను చూపిస్తూ ఒక యాడ్ తయారు చేసింది. బంగారం కన్నా ఈ ఐరన్ ఎంతో విలువైనదని సంస్థ ప్రచారం చేస్తోంది.

భారత దేశంలో రక్తహీనత వల్ల మహిళలు ఎంతో మంది మరణిస్తున్నారు.. వ్యాధుల బారిన పడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -2018 ప్రకారం మన దేశంలో యాభై మూడు శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేల్చింది. అందుకే మహిళలు బంగారంపై మోజు తగ్గించుకొని ఈ ధన్ తేరస్ పండుగ నుంచి ఆరోగ్య రక్షణకు ఐరన్ ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, మొక్కజొన్న తదితర పదార్థాలను ఎక్కువగా తినాలని ఈ సంస్థ ప్రచారం చేస్తోంది.