Begin typing your search above and press return to search.
హద్దులు దాటిపోతున్న ప్రచారం
By: Tupaki Desk | 25 Nov 2020 3:00 PM GMTపాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం..బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్
బీజేపీకి అవకాశం ఇస్తే గోల్కొండ, చార్మినార్లను కూడా అమ్మేస్తుంది..కేటీయార్
ఇది గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలు ప్రచారం చేస్తున్న తీరు. ఎన్నికల ప్రచారంలో హుందాతనం వెతికినా ఎక్కడా కనబడటం లేదు. తమకు అధికారం అప్పగిస్తే ప్రజలకు ఏమి చేస్తామనే విషయాన్ని చెప్పడం మానేసి ప్రత్యర్ధులకు ఓట్లేసి గెలిపిస్తే ఏమి చేస్తారనే విషయంపైంనే ప్రధానంగా దృష్టి పెట్టటం బాధాకరమనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసి)ఎన్నికల్లో పార్టీల ప్రచారం హద్దులన్నింటినీ దాటిపోతోంది. ప్రత్యర్ధి పార్టీలపై బురద చల్లేయటమే ఏకైక లక్ష్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చేసుకుంటున్న ప్రచారం రోత పుట్టిస్తున్నాయి.
బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బండి సంజయ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. పాతబస్తీలో టెర్రరిస్టులు, రోహింగ్యాలున్నారంటూ బండి చేసిన ఆరోపణలు ఒక్కసారిగా వేడి పుట్టించేశాయి. టెర్రరిస్టులను, రోహింగ్యాలను వెంటనే ప్రభుత్వం బయటపెట్టాలంటూ బండి డిమాండ్ చేశారు. మరి బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన తర్వాత టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్ కేటీయార్ ఊరకుంటారా ?
బండి ఆరోపణలకు సమాధానమిస్తు సర్జికల్ స్ట్రైక్స్ పాకస్ధాన్ మీద చేసుకోవాలంటూ రివర్స్ ఎటాక్ చేశారు. పాతబస్తీలో టెర్రరిస్టులు కానీ రోహింగ్యాలు కానీ ఉంటే చూపాలంటూ సవాలు విసిరారు. ఇక తమను ఉద్దేశించే బీజీపీ ఆరోపణలు చేసినపుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఎందుకు కామ్ గా ఉంటారు ? కాబట్టి ఓవైసీ కూడా కమలం నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాక్తలు మొదలుపెట్టేశారు.
బీజేపిని గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే గోల్కొండ, చార్మినార్లను కూడా అమ్మేస్తారంటూ కేటీయార్ విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ కేంద్రం అమ్మేస్తున్న విషయాన్ని కేటీయార్ గుర్తుచేశారు. ఇక అసదుద్దీన్ మాట్లాడుతూ ఓల్డ్ సిటిలో పాకిస్ధాన్ వాళ్ళు, టెర్రరిస్టులు, రోహింగ్యాలు ఎక్కడున్నారో వెంటనే కమలం నేతలు నిరూపించాలంటూ సవాలు విసిరారు. ఇలా పార్టీల మధ్య ప్రచారం అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు-వాటి పరిష్కారాలను ప్రస్తావించటం మానేసి కేవలం ఓట్ల కోసమే దిగజారిపోయి జనాలను రెచ్చగొట్టేస్తున్నారు.
నిజానికి బీజేపీకి అధికారం ఇచ్చినా గోల్కొండ, చార్మినార్ ను అమ్మే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది టీఆర్ఎస్. గ్రేటర్ లో గెలిచినంత మాత్రాన బీజేపీ చేయగలిగేది ఏమీ ఉండదని అందరికీ తెలుసు. అలాగే బీజేపీని గెలిపిస్తే ఓల్డ్ సిటిలో సర్జికల్ స్ర్టైక్స్ చేయగలిగే అవకాశమూ లేదు. ఎందుకంటే జీహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచేస్తే యావత్ పోలీసు, మిలిటరీ వ్యవస్ధలు బీజేపీ ఆధీనంలోకి వచ్చేసేదేమీ లేదు. కాబట్టి జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలన్న యావ తప్ప తమ ప్రచారం హద్దులు దాటి పోతోందన్న విషయాన్ని నేతలు గుర్తించటం లేదు.