Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కార్ దివాళా నుంచి బ‌య‌ట ప‌డిందా...!

By:  Tupaki Desk   |   26 Nov 2021 2:30 PM GMT
ఏపీ స‌ర్కార్ దివాళా నుంచి బ‌య‌ట ప‌డిందా...!
X
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత దీనస్థితిలో వెళుతుందో చూస్తూనే ఉన్నాం. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం కరెక్ట్ టైంకు పడటంలేదు. మరోవైపు ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో అసలు అభివృద్ధి అన్న ప‌ద‌మే అంద‌రూ మరిచిపోయారు, ప్రజలు కూడా సంక్షేమానికి అలవాటు పడిపోయి అభివృద్ధి అన్న పదాన్ని కూడా త‌లవడం లేదు. ఇక కొద్ది నెలల క్రిందట వరకు బ్యాంకులు సైతం ఏపీ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వమని తేల్చిచెప్పిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఎస్బీఐ హోమ్‌లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ పని పూర్తయ్యే సరికి కనీసం రెండు నెలలు పడుతుంది.

అయితే ఏపీ ప్ర‌భుత్వంపై ఎస్బీఐ చాలా ఔదార్యం చూపించింది. కేవ‌లం వారం రోజుల్లో రు. 1500 కోట్ల రుణం ఇచ్చేసింది. ఏపీ స‌ర్కార్ బ్యాంకుకు తాక‌ట్టు పెట్టేందుకు, గ్యారంటీ ఇవ్వడానికి ఏం లేక‌పోయినా కూడా ఎస్బీఐ మాత్రం అమిత‌మైన ప్రేమ కురిపించేసింది. అయితే ఇక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు ఉంది. ఇటీవ‌ల ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి ఆ పేరుతో అదానికి పోర్టులు క‌ట్ట‌బెట్టేశారు. ఇప్పుడు ఆ బోర్డు పేరుతోనే రు. 1500 కోట్ల అప్పు తెచ్చారు.

వారం రోజుల క్రింద‌టే కేంద్ర విద్యుత్ సంస్థ‌ల చైర్మ‌న్లు రంగంలోకి దిగి మా అప్పు తీరుస్తారా ? లేదా ? అని భీష్మించుకున్నారు. కండీష‌న్లు పెట్టారు. దీంతో పీక‌ల మీద‌కు వ‌చ్చేసింద‌న్న విష‌యం తెలుసుకున్న ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా పెట్టుకున్న ఎస్బీఐ మాజీ చైర్మ‌న్ ర‌జ‌నీష్‌తో లాబీయింగ్ న‌డిపింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ర‌జ‌నీష్ ప్ర‌స్తుత ఎస్బీఐ చైర్మ‌న్‌తో మాట్లాడుకుని ఏం చేశారో కాని.. రు. 1500 కోట్ల రుణం ఇచ్చేందుకు ఎస్బీఐ ఓకే చెప్పింది.

అలా బ్యాంకు నుంచి మారిటైం బోర్డు ఖాతాలో ఈ రు. 1500 కోట్లు ప‌డ్డాయో లేదో గాని.. వెంట‌నే ఆ నిధుల‌ను కేంద్ర విద్యుత్ సంస్థ‌లకు బ‌కాయిలుగా చెల్లించేశారు. అయితే ఇక్క‌డే మారి టైం బోర్డున‌కు జెన్‌కోల‌కు చెల్లించాల్సిన అప్పుల‌కు లింక్ ఏంట‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికి తెలియ‌దు. అది త‌ర్వాత మ‌రో అప్పు తీసుకున్న‌ప్పుట‌కి కాని ఎవ్వ‌రికి గుర్తు ఉండ‌దు.