Begin typing your search above and press return to search.
భారత సంజీవినికి సీన్ లేదనేస్తున్న డ్రాగన్ సైంటిస్టులు
By: Tupaki Desk | 17 April 2020 3:45 AM GMTకష్టకాలంలో తమకు అందించాల్సిన సాయం గురించి భారత్ ను బ్రతిమిలాడటమే కాదు.. మీరు కాదంటే మీకే నష్టమన్న వార్నింగ్ ఇచ్చేశారు. ప్రపంచానికి పెద్దన్న తనకున్న పొగరును కరోనా వేళలోనూ ప్రదర్శించారు. ప్రాణాంతక వైరస్ కు చెక్ చెప్పే సత్తా ఉండటమే కాదు.. భారత సంజీవినిగా మారింది హైడ్రాక్సీక్లోరోక్విన్.
తమకు ఆ మందును ఇవ్వాల్సిందిగా కోరాయి పలు దేశాలు. దీనికి తగ్గట్లే భారత్ స్పందించటమే కాదు.. కష్టకాలంలో ఉన్న పలు దేశాలకు ఆ ట్యాబ్లెట్లను పంపింది. కరోనాకు భారత సంజీవిని ప్రభావంతంగా పని చేస్తుందన్న పేరు వచ్చింది. ఇప్పటివరకూ ఈ ట్యాబ్లెట్లను పదమూడు దేశాలకు భారత్ ఎగుమతి చేసింది కూడా. ఇలాంటివేళ.. డ్రాగన్ దేశానికి చెందిన సైంటిస్టులు సంచలన ప్రకటన చేశారు.
కరోనా వైరస్ ను తగ్గించే విషయంలో హైడ్రాక్సీక్లోరిక్విన్ డ్రగ్ ప్రభావవంతంగా పని చేసే సీన్ లేదంటున్నారు. తాజాగా షాంఘై జియావ్ తోంగ్ వర్సిటీ పరిశోధకులు నూటయాభై మంది పై ఈ డ్రగ్ ను పరీక్షించారు. ఈ ప్రయోగంలో భాగంగా ఈ నూటయాభై మందిని రెండు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒకరికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ఇవ్వగా.. మరో గ్రూపునకుసాధారణ పద్దతిలో వైద్యం చేశారు.
ఈ రెండు గ్రూపుల వారిలో కరోనా వైరస్ ను తగ్గించటంలో భారత సంజీవిని కొంతమేర మాత్రమే ప్రభావం చూపించినట్లుగా సదరు వర్సిటీ పేర్కొంది. ప్రామాణిక చికిత్స కంటే ఇది ప్రభావవంతంగా పని చేయలేదన్న మాటను సైంటిస్టులు తేలుస్తున్నారు. తన ఇంట్లో పుట్టిన వైరస్ కు చెక్ చెప్పే సత్తా తనకు మాత్రమే ఉందన్న ఉక్రోషాన్ని చైనా సైంటిస్టులు ప్రదర్శించారా? నిజంగానే భారత సంజీవినికి అంత సీన్ లేదా? అన్నది కాలమే తేల్చాలి.