Begin typing your search above and press return to search.
పేటియం అధ్యక్షుడి నెక్స్ట్ టార్గెట్ అమెరికానేనా..?
By: Tupaki Desk | 26 Oct 2019 9:00 AM GMTభారతదేశంలో డిమానిటైజేషన్ జరిగిన తరువాత డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధాని మోడీ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో రాత్రికి రాత్రే ఇండియా మొత్తం డిజిటల్ పేమెంట్స్ వైపు చూసింది. నగదు రహిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పురోగమించేందుకు డిమానిటైజేషన్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పినా కూడా దేశ ప్రజానీకం ఎన్నో ఇబ్బందులకు గురైంది. ఆ తరువాత చిన్నగా డిజిటల్ పెమెంట్స్ పై అవగాహనా పెంచుకుంటూ వస్తున్నారు. ఇండియన్స్ ముఖ్యంగా పేటియం ద్వారా ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో సుమారుగా 40 కోట్లమందికి పైగా జనాభా పేటియం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
పేటియంని ఎక్కడైనా భోజనం చేసి డబ్బులు చెల్లించడానికి - కరెంట్ బిల్లు పే చేయడానికి - ఫ్రెండ్స్ కి మనీని ఇవ్వడానికి ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. మోడీ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో తెల్లవారి లేచేసరికి ..ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలుగా తయారైపోయారు. కనీసం టీ తాగడానికి కూడా చిల్లర లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత కూడా తమ డబ్బుని తాము తీసుకునేందుకు కూడా ఏటిఎం వద్ద గంటల తరబడి క్యూ లైన్స్ లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో పేటియం అందరికి ఆసరాగా నిలబడింది.
ఇక అప్పటివరకు పేటియం వ్యాలెట్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించేది. ఆ తరువాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి కూడా ప్రవేశించి పేటియం పెమెంట్స్ బ్యాంక్ ని స్టార్ట్ చేసింది. పేటియం బ్యాంక్ ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. కానీ , పేటియం అధ్యక్షుడు విజయ్ శేఖర్ శర్మ మాత్రం దాదాపుగా 50 కోట్ల మందిని పేటియం బ్యాంకింగ్ లో భాగస్వామ్యం చేయాలనీ చూస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో కోట్లాది మంది వ్యాపారాలు పేటియం ద్వారా పెమెంట్స్ ని పూర్తి చేయడానికి సహకరిస్తున్నారు. పేటియం అధ్యక్షుడు మాట్లాడుతూ ... ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి వ్యాలెట్ , కార్డ్స్ మరియు క్యాష్ ని తమవెంట తీసుకునిపోయే అవసరంలేకుండా చేయడమే తన లక్ష్యం అని తెలిపారు.2012 లో భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న పేటియం ఇండియాలో పేటియం వ్యాలెట్ ద్వారా లావాదేవిలని చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం డిజిటల్ పెమెంట్స్ లో దేశంలోనే అగ్ర స్థానంలో కొనసాగుతూ పేటియం మాల్స్ ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం పేటియం అధినేత ఈ పేటియంని భారతదేశంతో పాటుగా ఇతర దేశాలలో కూడా విస్తరింప చేయాలని చూస్తున్నారు. జపాన్ లో ఇప్పటికే యాహు తో కలిసి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాడు. కానీ , జపాన్ లో ఇప్పటికి కూడా 50 శాతానికి పైగా జనాభా క్యాష్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. అతి త్వరలోనే పేటియంని అమెరికాలో కూడా విస్తరింపచేయాలని చూస్తున్నారు.