Begin typing your search above and press return to search.
తలనొప్పులు ఎన్నో : కేసీయార్ జాతీయ నేత కాగలరా....?
By: Tupaki Desk | 6 Oct 2022 7:43 AM GMTజాతీయ పార్టీ పెట్టాను అని హైదరాబాద్ లో కూర్చుని తన మనుషుల చేత చప్పట్లు కొట్టించుకున్నంత ఈజీ కాదు. జాతీయ పార్టీ అంటే మాటలా. పైగా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని చోట్లా అనేక సమస్యలు ఉన్నాయి. జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ లాంటివే దేశంలో ఉన్న అనేక క్లిష్ట సమస్యలకు ఈ రోజుకు కూడా సరైన పరిష్కారం చూపించలేక చేతులెత్తేశాయి. నిజంగా జాతీయ పార్టీలలో జాతీయ వాదం ఏ కోశానా ఉన్నా ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోయి ఉండేది కాదు, పైగా అడ్డగోలుగా విడగొట్టేవారే కాదు.
అయితే కేసీయార్ ఇక్కడ చూసుకుంటే ఒక ఉప ప్రాంతీయ నేత. ఆయన చేతిలో చూస్తే 17 సీట్లు మాత్రమే ఉన్నాయి. దేశంలో తెలంగాణా చాలా చిన్న రాష్ట్రం. రాజకీయంగా ప్రభావం చూపించే పరిస్థితి అయితే అంతగా లేని రాష్ట్రం. అలాంటి రాష్ట్రం నుంచి కేసీయార్ జాతీయ పార్టీ అనేశారు. మరి ఆయన మదిలో ఏ ముహూర్తాన ఈ బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఇది మంచికా చెడ్డకా అన్న చర్చ అయితే సొంత పార్టీతో పాటు బయట కూడా హాట్ హాట్ గా నడుస్తోంది.
ఇదిలా ఉంటే కేసీయార్ గురించి ముందే చెప్పుకున్నట్లుగా ఆయన పక్కా తెలంగాణావాది. ఎంత భయకరమైన వాది అంటే కిందా పడ్డా తనదే పై చేయి అని ఒప్పించే ఉద్యమకారుడు ఆయనలో ఉన్నారు. ఆయన నూటికి నూరు అన్నీ కూడా ఒక్క తెలంగాణాకే దాఖలు పడాలని కోరుకునేవారు. ఇంతలా తెలంగాణాతో ఒక ప్రాంతీయవాదంతో ముడి వేసుకుని పోయిన కేసీయార్ లో జాతీయ వాదం అంటే అది పొరుగు రాష్ట్రాల వారికి ఎపుడూ అనుమానంగానే ఉంటుంది.
ఇక ఉద్యమ కాలంలో కేసీయార్ ఆంధ్రా వాళ్ళను దారుణంగా విమర్శించారు. కేవలం తన రాజకీయ స్వార్ధంతో కేసీయార్ ఆంధ్రుల మీద విమర్శలు లెక్కలేనన్ని చేశారు. అందులో నిజాల కంటే నిందలే ఎక్కువగా ఉన్నాయని అంతా అంటారు. ఇక తెలంగాణా రాష్ట్రం వచ్చింది అంటే అందులో కేసీయార్ రాజకీయ ఆరాటంతో పాటు నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ అవకాశవాద రాజకీయ కూడా ఒక కారణంగా చెప్పాలి.
లేకపోతే కేవలం రెండంటే రెండు ఎంపీ సీట్లు ఉన్న కేసీయార్ తెలంగాణాను ఎలా సాధించగలరు. అయితే అంతా తన గొప్పతనమే, తాను అద్భుతాలు చేశాను అని కేసీయార్ భావిస్తున్నారు. వందిమాగధులు కూడా అదే అంటున్నారు. ఇక తెలంగాణా వచ్చాక రాజకీయ సమీకరణలు మారి రెండు సార్లు కేసీయార్ గెలిస్తే గెలవవచ్చు కాక. అంత మాత్రం చేత ఆయన దేశంలో కొమ్ములు తిరిగిన రాజకీయ మొనగాడు ఎలా అవుతారు అన్నదే కీలకమైన ప్రశ్న.
ఇక కేసీయార్ పక్కా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టారు అన్న సంగతి ఆంధ్రులకే కాదు సౌత్ మొత్తం రాష్ట్రాలకు తెలుసు. ఇపుడు ఆయన జాతీయ పార్టీ అంటూ నెత్తికెత్తుకుని ఆయా రాష్ట్రాలకు వస్తే వారు ఎందుకు ఆయనను దగ్గరకు తీస్తారు అన్నదే చర్చ. అంత మంచి మనసు కూడా దక్షిణాది రాష్ట్రాల నేతలకు లేదు అని కూడా చెబుతారు. ఇలా కేసీయార్ భారత్ రాష్ట్ర సమితికి సరిహద్దు రాష్ట్రాల మద్దతు దక్కుతుంది అన్నది పూర్తిగా అనుమానమే అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే కేసీయార్ ఆంధ్రులను విలన్లుగా బాగా చిత్రీకరించారు. ఇపుడు ఏపీకి వెళ్తే వారు ఎలా నమ్ముతారు అన్నది కీలకమైన ప్రశ్న. తెలనాణా వచ్చాకా ఆంధ్రూలను ఏమైనా అన్నామా అని టీయారెస్ నేతలు వాదించవచ్చు కానీ ఒక రాష్ట్ర అధినేతగా కేసీయార్ అభివృద్ధి కోణంలో నుంచి చూసి ఆంధ్రులను ఏమీ అనలేదు అన్నదే అంతా నమ్ముతారు. అంతే కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సీమాంద్ర ఓట్ల కోసం కూడా ఆయన అలా చేశారు అని కూడా విశ్లేషిస్తారు.
ఏది ఏమైనా ఆయన తెలంగాణాలో ఆంధ్రులకు ఏమీ అనలేదు కాబట్టి ఆయన జాతీయవాది అని అనుకోవడానికి లేదు. ఆయన జాతీయ పార్టీ పెట్టక ముందు రోజు దాకా కూడా పక్కా ప్రాంతీయ వాదిగానే ఉంటూ వచ్చారు. ఈ నేపధ్యంలో కేసీయార్ తెలంగాణా పొలిమేరలు దాటి తన పార్టీని విస్తరించడం అంటే కష్టమనే అనుకోవాలి.
ఇక నీటి తగవులు దేశమంతా ఉన్నాయి. వాటిని బీజేపీ కాంగ్రెస్ తీర్చలేకపోతున్నాయి. ఈ విషయంలో కర్నాటక తమిళనాడు నీటి గొడువలు అతి పెద్ద ఉదాహరణగా చూడాలి. అలాగే కర్నాటక గోవాల మధ్య కూడా నీటి తగవులు ఉన్నాయి. ఆయా పార్టీల రాష్ట్ర శాఖలు ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడుతూ ఉంటాయి. ఇపుడు కేసీయార్ బీయారెస్ కూడా ఆంధ్రా లో ఒక మాట, కర్నాటకలో మరో మాట, తెలంగాణాలో ఇంకో మాట చెబితే ఆయన జాతీయ రాజకీయ విధానానికి అర్ధం ఏమి ఉంటుంది. ఎటు నుంచి ఎలా చూసినా కేసీయార్ జాతీయ వాదం అడుగడుగునా ప్రశ్నార్ధకంగానే ఉంది అని చెప్పాలి. సో ఆయన బీయారెస్ అయితే ఈ రోజుకు ఎలాంటి అద్భుతాలూ క్రియేట్ చేయలేదు అనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.