Begin typing your search above and press return to search.
నెట్‌వర్క్ లేకున్నా ఈ ఫోన్‌తో కాల్స్ చేసుకోవచ్చట!
By: Tupaki Desk | 1 Sep 2021 11:30 AM GMTప్రజెంట్ సొసైటీలో మొబైల్ ఫోన్ అనేది ప్రతీ ఒక్కరి కంపల్సరీ అయిపోయింది. నిరుపేదలు సైతం మొబైల్ ఫోన్ తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వాలు ఫోన్ నెంబర్ యూసేజ్ ఉంటున్నది. మొత్తంగా ప్రతీ ఒక్కరు మొబైల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ యూసేజ్ కూడా బాగా పెరిగింది. ఫలితంగా పిల్లలు నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు దాదాపుగా ఫోన్ లేనిదే ఏం చేయగలిగే పరిస్థితులు లేవు. కాగా, ఫోన్ వర్క్ చేయాలంటే కావాల్సిన వాటిలో ముఖ్యమైనది నెట్‌వర్క్.
టవర్ నుంచి వచ్చే సిగ్నల్ ఉంటేనే కాల్స్ చేసుకోవడంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు. లేదంటే ఎటువంటి పని చేసుకోరాదు. నెట్‌వర్క్ అనేది లేకుండా ఉంటే ఫోన్ ద్వారా ఏం చేయరాదు. కాగా, నెట్‌వర్క్ ఇష్యూను అధిగమించేందుకుగాను యాపిల్ కంపెనీ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్ సంస్థ తీసుకొచ్చిన ఐఫోన్ 13లో నెట్‌వర్క్ లేకున్నా సరే మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చట. ఈ అవకాశాన్ని ఆ సంస్థ కల్పిస్తున్నది. తక్కువ ఎత్తులో కూడా శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యే విధంగా యాపిల్ ఐఫోన్ 13 ని తయారు చేస్తున్నట్లు సాంకేతిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ మొబైల్‌లో క్వాల్‌కోమ్ ఎక్స్ 60 మోడెమ్‌ను ఉపయోగించినట్లు అంచనా వేస్తన్నారు. తద్వారా నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యేందుకు వీలుంటుందట. ఇందుకుగాను యాపిల్ సంస్థ స్పేస్ ఎక్స్ అనే దిగ్గజ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుందట. ఇకపోతే యాపిల్ కంపెనీ శాటిలైట్ కనెక్టివిటీ కోసమై ఆయా దేశాల అనుమతుల కొసం అప్లికేషన్స్ కూడా చేసుకుంది. ఇక యాపిల్ ఐఫోన్ 13 అయితే ఇప్పుడు నాలుగు వేరియేషన్స్‌లో లభ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఐఫోన్ 13, ఐఫోన్ 13 ఫ్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్, ఐఫోన్ 13 మినీ వేరియంట్లలో లభిస్తుందని వివరిస్తున్నారు. మొత్తంగా నెట్‌వర్క్ ఇష్యూ రాకుండా తయారయిన ఈ ఫోన్లను చూస్తుంటే భవిష్యత్తు తరం డిజిటల్లీ అవేర్ అయి ఉంటారని, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఇంకా చాలా జరిగే చాన్సెస్ ఉన్నాయని సాంకేతిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటితో పోల్చితే టెక్నాలజీ రంగంలో ఇప్పటికే పెను మార్పులు జరిగాయని, భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు జరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు డబ్బా ఫోన్లు మాత్రమే ఉండేవి. అనగా ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడటం మాత్రమే వాటి ద్వారా సాధ్యపడేది. కానీ, ఇప్పుడు వీడియో కాల్స్ సాధ్యమవుతున్నది. కనెక్టివిటీ అనేది బాగా పెరిగిపోయింది. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్స్ యూసేజ్ బాగానే పెరిగిందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే టెక్నాలజీ రంగంలో వినూత్నమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావొచ్చని, అందుకే యువత ఈ రంగంపైన దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ మానవాళికి ఉపయోగపడేలా, వారి పనులను ఇంకా ఈజీగా చేసుకునేందుకు సాయపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తు తరం టెక్నాలజీదే కాగా, రోబొటిక్స్ రంగంలోనూ వినూత్నమైన ఆవిష్కరణలు జరగనున్నాయి.