Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ కు కొడాలి నానిని పిలిచే ధైర్యం ఉందా..?

By:  Tupaki Desk   |   7 Nov 2022 12:30 PM GMT
అన్ స్టాపబుల్ కు కొడాలి నానిని పిలిచే ధైర్యం ఉందా..?
X
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న ''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు ఓటీటీ 'ఆహా' తీసుకొచ్చిన ఈ సెలబ్రిటీ టాక్ షో.. మొదటి సీజన్ ను పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా రెండో సీజన్ లో అడుగుపెట్టింది.

'అన్ స్టాపబుల్ 2' లో ఇప్పటి వరకూ స్ట్రీమింగ్ అయిన మూడు ఎపిసోడ్స్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఫస్ట్ సీజన్ లో సినీ సెలబ్రిటీలు మాత్రమే గెస్టులుగా హాజరవ్వగా.. ఈసారి మాత్రం రాజకీయ నాయకులు కూడా పాల్గొంటారని నిర్వాహకులు హింట్ ఇచ్చారు.

'అన్ స్టాపబుల్ విత్ NBK-2' టాక్ షో మొదటి ఎపిసోడ్ కు చీఫ్ గెస్టుగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటుగా బాలయ్య అల్లుడు నారా లోకేష్ కూడా వచ్చారు. బావ బావమరిది.. మామా అల్లుళ్ళ మధ్య ఆసక్తికరమైన సంభాషణతో సాగిన ఈ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలానే రెండో ఎపిసోడ్ కు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ అతిధులుగా వచ్చి సందడి చేయగా.. మూడో ఎపిసోడ్ లో మరో ఇద్దరు బ్యాచిలర్ యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ గెస్టులుగా వచ్చి అలరించారు.

అయితే ఇప్పటి వరకూ 'అన్ స్టాపబుల్' షోకి గెస్టులుగా వచ్చిన వారందరూ బాలయ్య ను అభిమానించేవారు లేదా ఆయనతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నవారే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో షో ఆద్యంతం నందమూరి సీనియర్ ని పొగడటంతోనే సరిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అందుకే బాలకృష్ణకు సొంత డబ్బా కొట్టే వాళ్ళను కాకుండా.. బాక్సాఫీస్ ప్రత్యర్థులను లేదా అపోజిట్ పార్టీలకు చెందిన ప్రముఖులను కూడా ఈ టాక్ షోకి గెస్టులుగా పిలిస్తే అప్పుడు అసలైన మజా ఉంటుందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీకి చెందిన కొడాలి నాని లాంటి లీడర్స్ ని పిలిచి బాలయ్యతో చిట్ చాట్ నిర్వహించే ధైర్యం చేయగలరా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే అలాంటి వారిని పిలిచి టాక్ షో నిర్వహిస్తే.. అప్పుడు 'కింగ్ ఆఫ్ ఆల్ టాక్ షోస్' అనిపించుకుంటుందని.. బాలకృష్ణ స్టైల్ లో చెప్పాలంటే 'అమ్మ మొగుడు ఆఫ్ ఆల్ టాక్ షోస్' అవుతుందని అంటున్నారు.

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ తొలిసారిగా హోస్ట్ అవతారమెత్తిన బాలయ్య.. తనదైన శైలిలో షోని నడుపుతున్నారు. ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ప్రతీ ఎపిసోడ్ కూడా అన్ స్టాపబుల్ అనిపించుకుంది. కాకపోతే ఇప్పటి వరకూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే సెలబ్రిటీలు ఎవరూ ఈ కార్యక్రమంలో కలిపించలేదు.

ఈసారి అలాంటి వారిని అతిథిలుగా తీసుకొచ్చి బాలకృష్ణతో సంభాషణ జరిపిస్తే ఎలా ఉంటుంది?.. నటసింహం వాళ్ళని ఎలా డీల్ చేస్తారు? అనేది చూడానే ఆసక్తి సినీ అభిమానుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో 'అన్ స్టాపబుల్' షోకి బాలయ్య ప్రత్యర్థులను కూడా తీసుకొచ్చి 'ఆహా' అనిపిస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.