Begin typing your search above and press return to search.

పాల ప్యాకెట్ తో కరోనా డేంజర్ అంత ఉందట

By:  Tupaki Desk   |   10 April 2020 5:17 AM GMT
పాల ప్యాకెట్ తో కరోనా డేంజర్ అంత ఉందట
X
కరోనా వేళ.. శానిటైజర్.. మాస్క్.. లాక్ డౌన్.. భౌతిక దూరం..హైడ్రాక్సీ క్లోరోక్విన్.. లాంటి మాటలన్ని ఇప్పుడెంతో దగ్గరయ్యాయి. ఈ మాయదారి వైరస్ ను ఇంట్లోకి రానివ్వకుండా ఉండేందుకు ఎవరికి వారు.. వారి ఇళ్లల్లోనే ఉండిపోవటం తెలిసిందే. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోజువారీ వినియోగం కోసం తీసుకొచ్చే పాల పాకెట్లతో కరోనా వైరస్ ను ఇంట్లోకి దర్జాగా వచ్చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

పెద్దగా పట్టించుకోని కొన్నివిషయాలే కరోనా వ్యాప్తికి కేరాఫ్ అడ్రస్ లుగా మారుతుంటాయి. అలాంటి కోవలోకే వస్తాయి పాల ప్యాకెట్లు అని చెప్పాలి. పాల పాకెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. కరోనా వైరస్ ను ఇంట్లోకి తెచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందంటున్నారు. అందుకే పాల పాకెట్లను తీసుకొచ్చిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటమే కాదు.. వాటిని బాగా కడగాలని చెబుతున్నారు. ఒకసారి కడిగిన తర్వాత రెండు గంటల వ్యవధి తర్వాతే వాటిని ముట్టుకోవాలని చెబుతున్నారు.

ఇదొక్కటే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసు మీద పడిన వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. యాభై ఏళ్లుదాటినోళ్లు బయటకు రాకపోవటమే మంచిదన్న మాట వినిపిస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కొంచెం జలుబు ఉన్నా.. వారి దగ్గరకు వెళ్లకూడదని చెబుతున్నారు. పెద్ద వయస్కులు మాస్కులు పెట్టుకోవాలని చెబుతున్నారు. కరోనాకు చెక్ పెట్టటంలో రోగనిరోధక శక్తి కీలకమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఇంట్లో ఉన్న వేళ.. దీన్ని ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంతమంచిది.

విటమిస్ సీ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం.. నీళ్లు బాగా తాగటం.. జింక్ సప్లిమెంట్స్ తీసుకోవటం లాంటివి అవసరమని చెబుతున్నారు. అంతేకాదు.. వైరస్ గురించి అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం లేదని.. దీని కారణంగా యాంగ్జైటీ పెరగటమే కాదు.. అనవసరమైన సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అందుకే.. కూల్ గా ఉండటం.. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మీ దరికి వచ్చే ఛాన్సే లేదు.