Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ పార్టీని ఎవ్వ‌రూ కాపాడ‌లేరా..?

By:  Tupaki Desk   |   30 Dec 2021 6:30 AM
ఏపీలో ఆ పార్టీని ఎవ్వ‌రూ కాపాడ‌లేరా..?
X
పార్టీలు ఏవైనా.. ప‌రమార్థం ఒక్క‌టే. అంతిమ ల‌క్ష్య‌మూ ఒక్క‌టే.. ! అదే..అధికారం. ఏపీలో ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప్ర‌త్యామ్నాయం కోరుకుంటున్న‌వారి సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే.. గ‌తంలో చంద్ర‌బాబు కానీ.. ఇప్పుడు జ‌గ‌న్ కానీ.. రాష్ట్ర ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న వాటిని కూడా తీసుకురాలేక పోయారు. క‌నీసం.. నిధులు కూడా ద‌క్కించుకోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. ఎనిమిది సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. దీంతో ఇప్పుడు ఏపీలో పాగా వేయాల‌నుకుంటున్న బీజేపీకి కూడా ఇవే స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి.

అయితే.. కేంద్రం ఎన్నో చేస్తోంది... అని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చెబుతున్నారు. అది మేమే ఇచ్చాం.. ఇది మేమే ఇచ్చాం.. అని చెబుతున్నా.. ఇత‌మిత్థంగా ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? మేము ఏం చేయాలి? అనే ప్ర‌ధాన సూత్రాన్ని మాత్రం ఆయ‌న ప‌క్క‌న పెట్టారు. దీంతో బీజేపీకి.. ప్ర‌మాదం పొంచి ఉంద‌నే విష‌యాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌కు ఎందుకు అండ‌గా నిల‌వలేద‌ని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. చెప్పారు. దీంతో రాష్ట్ర నేత‌లు.. అమ‌రావ‌తికి జై కొట్టారు.

అప్ప‌టి వ‌ర‌కు వ్య‌తిరేకించిన జీవీఎల్ వంటివారు కూడా జై కొట్టారు. అయితే.. ఈ ప‌రిణామం.. ఏమేర‌కు ఓట్లు రాలుస్తుంది? అనేది ప్ర‌శ్న‌. గుంటూరులో బీజేపీకి ఓటు బ్యాంకు శూన్యం. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పార్టీ అప్ప‌టి చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా ఓడిపోయారు. సో.. అమ‌రావ‌తికి జై కొట్టినా.. వ‌చ్చే న‌ష్టాన్ని భ‌ర్తీ చేయ‌డం.. బీజేపీకి సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డంలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టికిప్పుడు.. నాయ‌క‌త్వం బ‌ల‌ప‌డితేనే.. పార్టీకి మెరుగైన ఫ్యూచ‌ర్ ఉంటుంద‌ని చెబుతున్నారు. దీనిని వదిలేసి.. ఎన్ని కుస్తీలు ప‌ట్టినా.. ప్ర‌యోజనం ఉండ‌ద‌ని.. ఒక ప‌రాన్న జీవ పార్టీగా మిగిలిపోయే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. వ్యూహాలు మార్చుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.