Begin typing your search above and press return to search.

హోం మంత్రి : పాక్ పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ దాడులు

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:10 PM GMT
హోం మంత్రి : పాక్ పై మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ దాడులు
X
ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించేలా పాక్ ముందుకు సాగితే త్వ‌ర‌లోనే పాకిస్థాన్‌ పై మ‌రోసారి స‌ర్జిక‌ల్ దాడులు జ‌రిగినా జ‌ర‌గొచ్చ‌ని కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌ లో పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌రిపిన విష‌యం తెలిసిందే. అది జరిగిన నాలుగు నెల‌ల త‌ర్వాత మ‌రోసారి దాయాదికి త‌మ క‌ఠిన వైఖ‌రిని విస్ప‌ష్టంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు రాజ్‌ నాథ్‌. ఓ జాతీయ‌ టీవీ చానెల్‌ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో రాజ్ నాథ్ మాట్లాడుతూ "పాకిస్తాన్ మ‌న పొరుగుదేశం అనేది మాకు తెలుసు. వాళ్లు మంచిగా ఉంటే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ లాంటి దాడుల అవ‌స‌రం రాదు. కానీ ఉగ్ర‌వాద సంస్థ‌లు లేదా ఇత‌రులు భార‌త్‌ పై దాడికి దిగితే మాత్రం మ‌ళ్లీ స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌గ‌వ‌న్న హామీ ఇవ్వ‌లేను" అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు.

కాగా, ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ సయీద్‌ ను పాక్ హౌజ్ అరెస్ట్ చేయ‌డంపై స్పందిస్తూ.. అది కేవ‌లం కంటితుడుపు చ‌ర్య అని రాజ్‌ నాథ్ అన్నారు. నిజంగా ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని పాక్ అనుకుంటే...చ‌ట్ట‌ప‌రంగా అత‌నిపై చ‌ర్య‌లు తీసుకొని జైల్లో వేయాల‌ని స్ప‌ష్టంచేశారు. పాక్‌లో దాగున్న దావూద్‌ ను ప‌ట్టుకోవ‌డానికి స‌రైన స‌మ‌యం కోసం వేచి చూస్తున్నామ‌ని వెల్ల‌డించారు. పాక్‌పై విరుచుకుప‌డిన రాజ్‌ నాథ్ మ‌రో పొరుగ‌దేశ‌మైన చైనా విష‌యంలో మాత్రం ఆచితూచి స్పందించారు. జైషే చీఫ్ మసూద్ అజ‌ర్‌ ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించ‌డాన్ని చైనా ప‌దేప‌దే అడ్డుకోవ‌డంపై ఆయ‌న స్పందించారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా చైనా అలా వ్య‌వ‌హ‌రిస్తుండవ‌చ్చు. కానీ భ‌విష్య‌త్తులో దీనికి మ‌ద్దతు తెలుపుతార‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు. కానీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తే చైనాతో అదే రీతిలో తాము ముందుకు సాగుతామ‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/