Begin typing your search above and press return to search.

మందిరం నిర్మాణం కోసం తీర్పుదాకా ఆగ‌లేం

By:  Tupaki Desk   |   14 Jan 2016 6:08 PM GMT
మందిరం నిర్మాణం కోసం తీర్పుదాకా ఆగ‌లేం
X
అయోధ్యలో రామమందిరం నిర్మాణం...ఇటీవ‌లి కాలంలో దేశ‌వ్యాప్తంగా కాకా సృష్టించిన అంశం. మందిరం నిర్మాణం కోసం అయోధ్య‌కు ప‌విత్ర రాళ్ల‌ను త‌ర‌లించ‌డం నుంచి మొద‌ల‌యిన వేడి ఆ త‌ర్వాత కూడా కొన‌సాగింది. నిర్మాణం జ‌ర‌పాల‌ని హిందుత్వవాదులు ప‌ట్టుబ‌డుతుండ‌గా....లౌకిక‌వాదులు, ముస్లింవ‌ర్గాలు వ్య‌తిరేకిస్తున్నాయి. కోర్టు తీర్పు వ‌ర‌కు వేచి చూడాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

రామమందిర నిర్మాణంపై దేశంలోని హిందువులు కోర్టు తీర్పు కోసం ఎక్కువ కాలం వేచి చూడలేరని తొగాడియా వ్యాఖ్యానించారు. దేశంలోని వంద మంది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిర నిర్మాణం అన్నారు. కోర్టు తీర్పు కోసం వారు సుదీర్ఘ కాలం వేచి ఉండలేరని అందుకే అలాంటి పరిస్థితి తలెత్తక‌ముందే....కోర్టు తీర్పుతో పని లేకుండా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే సర్కార్ పని తీరుతో విశ్వ హిందూ పరిషత్ కు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో కూడా రామమందిర నిర్మాణం కోసం పార్లమెంటు చట్టం చేయాలంటూ తొగాడియా డిమాండ్ చేశారు