Begin typing your search above and press return to search.
ఒమిక్రాన్ అందరికీ సోకుతుందా.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటున్నది?
By: Tupaki Desk | 25 Jan 2022 6:05 AM GMTకరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. చాలా దేశాల్లో ఈ ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, ఐరోపాల్లోనూ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతపై ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. జెట్ స్పీడ్ తో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు అంటున్నారు. ఈ దశలో వైరస్ అందరికీ సోకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది.
దక్షిణాఫ్రికాలో ఉద్భవించిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు అతివేగంగా విస్తరించే గుణం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. అయితే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వైరస్ సోకుతుందనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రెస్పాండ్ అయింది. ఇది డెల్టా కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ హెడ్ మారియా వాన్ కెర్ ఖోవ్ అన్నారు. మునుపటి వేరింయట్ ప్రభావం కన్నా తక్కువ ప్రభావం ఉందని తక్కువ అంచనా వేయకూడదని... అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు. కొందరిలో ఇది తీవ్రంగ మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అయితే ఒమిక్రాన్ కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. టీకో తీసుకోని వారు, వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనారోగ్యంతో బాధపడేవారు మరణం సంభవించవచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసులు పెరుగుతున్నాయని మారియా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టీకాలు అంత ప్రభావవంతంగా లేవని చెప్పారు.
అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనగలిగే సామర్థ్యంతో ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు లేవని... కాబట్టి వైరస్ మళ్లీ దాడి చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. అందుకే ఈ వేరియంట్ పట్ల మరి కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కాగా ఒమిక్రాన్ తిరిగి వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎపిడెమియాలజిస్టులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అతి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టీకాలు తీసుకున్నా కూడా వైరస్ దాడి చేస్తుందని.. టీకాను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని అంచనా వేశారు.
ప్రపంచదేశాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి.అయితే మరణాల రేటు కాస్త తక్కువగానే ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారం దాకా వైరస్ ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అప్పటిదాకా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.