Begin typing your search above and press return to search.
పొంగులేటి కూడా బీజేపీలోకి జంప్ నా?
By: Tupaki Desk | 17 Aug 2022 4:25 PM GMTఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ స్పీడ్ అప్ చేసింది. టీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఈ విషయంలో జెట్ స్పీడుగా దూసుకెళుతున్నారు. ఆయన ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్. అందుకే అందులోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతున్నారు.
తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ కు బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పొంగులేటిని కూడా ఈటల బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈనెల 21 అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలోనే ఆరోజున పొంగులేటిని బీజేపీలో చేరికపై ఆరోజు క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.
ఖమ్మంలో పొంగులేటికి పోటీగా నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక మధ్యలో జిల్లా మంత్రి ఉన్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పొంగులేని నారాజ్ గా ఉన్నారు. గతంలో వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి అనంతరం టీఆర్ఎస్ లో చేరారు.ప్రతిసారి టికెట్ ఆశించి భంగపడుతున్నారు. టీఆర్ఎస్ లో రాజ్యసభ సీటును ఆశించి నెరవేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. సరైన అవకాశం కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కూతురు రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగగా.. పొంగులేటి వెంట టీఆర్ఎస్ నేతలకు బదులు బీజేపీ నేతలు ఉండడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. కమలనాథులతో విడివిడిగా పొంగులేటి ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.