Begin typing your search above and press return to search.

యూపీలో ఫ్లాప్ అయిన ప్రియాంకకు తెలంగాణ బాధ్యతలు?

By:  Tupaki Desk   |   11 Nov 2022 2:03 PM GMT
యూపీలో ఫ్లాప్ అయిన ప్రియాంకకు తెలంగాణ బాధ్యతలు?
X
ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ లో సోనియా, రాహుల్ తర్వాత అత్యంత క్రియాశీలక నేతగా ఉన్నారు. అందుకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బాధ్యతలను గత సారి ఆమె చేతుల్లో పెట్టారు. అక్కడ యోగిని ఆమె ఓడించలేదు. సరికదా కనీస పోటీనివ్వలేకపోయారు. ఇక యూపీలో రాహుల్ గాంధీ కూడా ఎంపీగా గెలవలేదంటే కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే యూపీలో పోయిన పరువును తెలంగాణలో దక్కించుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకతో బలోపేతమైన తెలంగాణ కాంగ్రెస్ ను అధికారం దిశగా నడిపించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ల అసమ్మతితో ఆగమాగమైన తెలంగాణ కాంగ్రెస్ ను పట్టాలెక్కించడమే ధ్యేయంగా ప్రియాంక గాంధీ పావులు కదుపుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పై జాతీయ నాయకత్వం ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తెలంగాణ బాధ్యతలు తీసుకుంటారని ఆ పార్టీ నేత మధుయాష్కీ తెలిపారు. పార్టీకి ప్రజల మద్దతుఎందుకు లేదనే దానిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సమీక్ష సమావేశం జరుగుతుందని చెప్పారు. సమీక్షలతో పాటు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక మార్క్ స్పష్టంగా కన్పించనుంది. రాహుల్, ప్రియాంక గాంధీలు తమకంటూ ఓ టీమును సెట్ చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. ఈ టీముతోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళుతారనే టాక్ విన్పిస్తుంది. అందుకే ప్రియాంకకు ఈ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారని సమాచారం.

ముఖ్యంగా గెలుపు అవకాశాలున్న రాష్ట్రాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. తెలంగాణ ఈసారి విజయంపై ఆశతోనే కీలకమైన ఈ రాష్ట్రానికి ప్రియాంకను ఇన్చార్జిగా పెట్టినట్టు తెలుస్తోంంది

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.