Begin typing your search above and press return to search.
జయ కూతురిని.. డీఎన్ఏ టెస్టు చేసుకోండి
By: Tupaki Desk | 27 Nov 2017 1:29 PM GMTదివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతానమంటూ ఇప్పటికే చాలా పేర్లు తెరమీదికి వచ్చాయి. ఆమె కొడుకునంటూ ఒకరు.. కూతురినంటూ మరొకరు మీడియా ముందుకు రావడం.. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడం తెలిసిందే. జయ కొడుకునంటూ ఓ వ్యక్తి ఒక ఫొటో పట్టుకుని కోర్టులో పిటిషన్ వేస్తే.. అతడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ తాను జయలలిత కూతురినంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అవసరమైతే తనకు డీఎన్ఏ టెస్టు చేసుకోవచ్చని ఆమె అంది. ఐతే ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ముందు హైకోర్టుకు వెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చారంటూ అమృత.. ఆమె లాయర్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమృత తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించేందుకు రావడంతో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. తాను జయలలిత కూతురినని.. జయలలిత సోదరి.. ఆమె భర్త కలిసి తనను పెంచారని.. జయలలిత చనిపోయిన అనంతరం తనకు వాళ్లిద్దరూ జన్మ రహస్యం చెప్పారని అమృత తన పిటిషన్లో పేర్కొంది. మరి సుప్రీం కోర్టు తన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో అమృత హైకోర్టుకు వెళ్తుందేమో చూడాలి. జయలలిత అవివాహితగా ఉండిపోగా.. ఆమెకు దివంగతుడైన ఓ నటుడితో ఒక సంతానం ఉందంటూ ఎప్పట్నుంచో అనుమానాలున్నాయి.