Begin typing your search above and press return to search.
టీకా దొంగలేమో కానీ.. వ్యాక్సిన్ వేసుకున్నా దిగులే?
By: Tupaki Desk | 6 Jun 2021 3:29 AM GMTఇప్పుడు నడుస్తున్నదంతా కరోనా కాలం. అయితే కరోనా లేదంటే వ్యాక్సిన్. ఇప్పుడు అందరి జీవితాల్లో ఈ రెండు అంశాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కరోనా గురించి ఎంత తెలిసినా.. అది తమ వరకు వచ్చే వేళలో ఉండే కంగారు.. కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు. అన్ని తెలిసినప్పటికి.. కరోనా పాజిటివ్ అన్న మాట విన్నంతనే తెలిని కుంగుబాటు మనిషిని కమ్మేస్తుంది. సరిగ్గా.. ఏం ఫర్లేదన్న ధీమా ఉన్నోళ్లు కూడా టీకా వేయించుకోవటానికి వెళ్లే సమయంలో ఏదో తెలీని శంక.. గుబులు పట్టి పీడిస్తుంది.
ఇప్పుడు అలాంటివాటిని వదిలేయాల్సిన టైం వచ్చేసింది. మీరు వ్యాక్సిన్ వేసుకొని ఉండొచ్చు. కానీ.. వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని వారికి తప్పనిసరిగా చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. మనిషి ప్రాణాల్ని సైతం సొమ్ములుగా మార్చుకునే ముదష్టపు కాలం వచ్చేసిన వేళలో.. ప్రతి విషయంలోనూ కక్కుర్తి. చివరకు వ్యాక్సిన్ విషయంలోనూ. కొవిడ్ వ్యాక్సిన్ కు ఉన్న కొరత.. దానికున్న డిమాండ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి 0.5 ఎం.ఎల్ చొప్పున వేయాల్సిన టీకా డోస్ ను 0.25 ఎంఎల్ కు వేస్తున్న దుర్మార్గం ఇప్పుడు బయటకు వస్తోంది.
అన్నిచోట్ల అని కాదు కానీ.. కొన్ని చోట్ల ఈ దారుణాలు ఎక్కువ అవుతున్నాయి. మరి.. అలా మిగిల్చిన వాటిని ఏం చేస్తారు? అన్న డౌట్ రావొచ్చు. బయట బాగా డిమాండ్ ఉండటంతో.. వాటిని దొంగతనంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. కొందరు ముఠాగా ఏర్పడి వ్యాక్సిన్లను మాయం చేస్తున్నారు. వ్యాక్సిన్లు ఒక్కొక్కరికి ఒక్కోటి కాకుండా.. పది మందికి సరిపోయే వ్యాక్సిన్ ను ఒకటే సీసాలో ఇస్తున్నారు. దీంతో.. ఈ మోసానికి తెర తీస్తున్నారు. పది మందికి వేయాల్సిన బాటిల్ ను ఇరవై మందికి వేస్తూ.. మిగిలిన వ్యాక్సిన్ సీసాల్ని తెలిసిన వారికి అమ్మేస్తున్నారు. సో.. మీరు కానీ.. మీకు తెలిసిన వారు కానీ వ్యాక్సిన్ వేయించుకునే వేళలో.. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ వేస్తున్నారా? లేదా? అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే అడ్డంగా మోసం పోవటం ఖాయం. జర జాగ్రత్త.