Begin typing your search above and press return to search.
కరోనా కొత్త వేరియంట్...70 శాతం వేగంగా వ్యాపిస్తోందట!
By: Tupaki Desk | 22 Dec 2020 4:00 AM GMTప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనావైరస్ కు వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు సంబరపడుతున్న తరుణంలో బ్రిటన్ లో బయటపడ్డ కరోనా కొత్త రకం స్ట్రైన్ గుబులు రేపుతోంది. బ్రిటన్ లో జెట్ స్పీడ్ తో వ్యాప్తి చెందుతోన్న ఈ కొత్త వైరస్....ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ లలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో, బ్రిటన్ కు రాకపోకలను పలు దేశాలు నిషేధించాయి. దీంతో, మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్...ఏ రేంజ్ లో డ్యామేజ్ చేస్తుందన్న అంచానాలు వేయడంలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. కరోనా వైరస్‌లోని కొన్ని భాగాలను ప్రభావితం చేస్తూ పరివర్తనం చెందడమనేది ఈ కొత్తరకం వైరస్ లక్షణమని గుర్తించారు. దీంతో, మనుషులకు సోకే సామర్థ్యం మరింత పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. దీంతో, ఇది మరింత ప్రమాదకరంగా మారి మరింత సులభంగా వ్యాపిస్తోందని గుర్తించారు. ఈ కొత్తరకం కరోనావైరస్‌ను మొదట సెప్టెంబరులోనే గుర్తించారని, డిసెంబరు రెండోవారం ముగిసేనాటికి మూడింట రెండొంతుల కేసులు ఈ కొత్త వైరస్ ప్రభావంతో ఏర్పడినవేనని గుర్తించారు. ఈ కొత్త రకం వైరస్ కు 70 శాతం అధికంగా సోకే సామర్థ్యం ఉందని, గతంలోని కరోనా వేరియంట్లకంటే కొత్తరకం చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
బ్రిటన్‌లోనే ఎవరో ఒక కరోనా రోగిలో ఇది ఉత్పరివర్తనం చెంది ఉండే అవకాశముందని, లేదంటే కరోనావైరస్ మ్యూటేషన్లను పరిశీలించే సామర్థ్యం తక్కువగా ఉన్న దేశాల నుంచి ఇది బ్రిటన్ చేరి ఉండవచ్చని అనుకుంటున్నారు. డెన్మార్క్, ఆస్ట్రేలియాలో కేసులు బ్రిటన్ నుంచి వచ్చినవేనని, అయితే, దక్షిణాఫ్రికాలోనూ కొత్త వేరియంట్ కు బ్రిటన్ లోకి కొత్త వేరియంట్ కు సంబంధం లేదని గుర్తించారు. మానవ శరీర కణాల్లోకి వైరస్ ప్రవేశించడానికి ఉపకరించే కరోనావైరస్‌పైన స్పైక్ ప్రోటీన్‌లో మార్పులు జరగడం వల్లే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్501వై అనే ఒక మ్యుటేషన్ కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లోని కీలక భాగమైన 'రిసెప్టర్ బైండింగ్ డొమైన్'ను మార్పులకు గురిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ భాగమే మానవ శరీర కణాలను తొలుత టచ్ చేస్తోందని, అందుకే దీనిలోని మార్పులు మరింత వేగంగా సోకేలా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే, వ్యాక్సీన్లు ఈ కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయా లేదా అన్న అపోహలు వద్దని, కొత్త వేరియంట్ పైనా వ్యాక్సీన్లు పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌లోని వివిధ భాగాలను నాశనం చేసేలా వ్యాక్సీన్లను రూపొందించారని, కనుక, కరోనావైరస్ స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్లు ఉన్నా కూడా మిగతా భాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సీన్లు సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఓ వైపు వ్యాక్సినేషన్ కు కొన్ని దేశాలు సిద్ధమవుతున్న తరుణంలో ఈ రకంగా కరోనా రూపాంతరం చెంది మరోసారి దాడిచేయడానికి సిద్ధంగా ఉండడం కలవరపెడుతోంది. మరి, ఈ డేంజరస్ కరోనా మ్యుటేషన్ వేరియంట్...బ్రిటన్ కే పరిమితమవుతుందా...లేదంటే కరోనా మాదిరిగానే మిగతా దేశాలనూ చుడుతుందా అన్నది వేచి చూడాలి.