Begin typing your search above and press return to search.
గ్రేటర్ పోలింగ్ తోనే టీఆర్ఎస్ ఓటమి లెక్క చెప్పేయొచ్చా?
By: Tupaki Desk | 30 Nov 2020 1:30 AM GMTఒక నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికలు.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. జాతీయ స్థాయిలోనూ ఆసక్తికరంగా మారటం ఇప్పటివరకు చూడనిది. ఇందుకు బీజేపీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాదాసీదాగా సాగిపోతాయని భావించిన గ్రేటర్ ఎన్నికలు ఇంత పోటాపోటీగా జరగటానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ అనుసరించిన వ్యూహం టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరి ముఖ్యంగా కేసీఆర్ మిస్ అవుతున్నదేమిటో కూడా ఆ పార్టీ చెప్పినట్లైంది. ఎన్నికలు ఏవైనా.. వాటిని భావోద్వేగంతో మార్చటమే కాదు.. ఎన్నికల ఎజెండాను సిద్ధం చేయటంలో టీఆర్ఎస్ ముందుండేది. అది వేసిన బాటలో మిగిలిన పార్టీలు నడిచేవి.
తొలిసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నిజానికి ఇలాంటి పరిస్థితికి కారణం.. టీఆర్ఎస్ తీరేనని చెప్పక తప్పదు. భావోద్వేగ అంశాల్ని తాను సైతం బలంగా డీల్ చేయగలనన్న విషయాన్ని కమలనాథులు అందరికి తెలిసేలా చేయటమే కాదు.. తాను విసిరిన వలలో టీఆర్ఎస్ పార్టీ చిక్కుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. తొలిసారి తాను ఎజెండా ఫిక్స్ చేస్తే.. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ అడుగులు వేయటం ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది.
ఇంతకీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకునే స్థానాల కంటే కూడా బీజేపీ విజయం సాధించే డివిజన్లు ఎన్ని అన్న అంశం పైనే చర్చ సాగుతోంది. మరి.. ఆ లెక్క తెలుసుకునేదెలా? దానికి సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయా? అంటే.. ఉన్నాయనే చెప్పాలి. 2016లో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్ శాతం 45 శాతం కంటే తక్కువ. అప్పట్లో టీఆర్ఎస్ కు అత్యధికంగా 99 స్థానాల్ని సొంతం చేసుకోగా.. మజ్లిస్ రెండో స్థానంలో నిలిచింది.
తాజా ఎన్నికల పోలింగ్ కానీ యాభై శాతానికి పైనే నమోదైతే.. అది కచ్ఛితంగా బీజేపీకే ప్రయోజనకరంగా మారుతుందని చెబుతున్నారు. ఎందుకంటే..ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్నవిగా చెప్పాలి. ఈ కారణంగా బీజేపీని తప్పనిసరిగా గెలిపించాలని అనుకున్న వారంతా ఓట్లు వేయటం ఖాయం. ఈ సెక్షన్ ఎంత ఎక్కువ వేస్తే.. అంత ఎక్కువ పోలింగ్ శాతం పెరిగే వీలుంది.
అదే సమయంలో.. అధికారపక్షం విషయానికి వస్తే.. గత ఎన్నికల వేళలో నమోదైన పోలింగ్ శాతం కానీ.. అంతకంటే తక్కువగా నమోదైతే మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.మరి.. పోలింగ్ నమోదు ఎంతన్నది తేలాలంటే మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు వెయిట్ చేయాల్సింది. పక్కా ఫిగర్ రాత్రి 8 నుంచి 9 గంటలకు మాత్రమే వచ్చే వీలుంది. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.