Begin typing your search above and press return to search.
వాటర్ ప్యూరిఫయర్లు కరోనాను చంపగలవా?
By: Tupaki Desk | 4 April 2020 2:30 PM GMTప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనాను కట్టడి చేయడం....కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడంలో పలు దేశాల శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. మరోవైపు కరోనా గాలిలో కచ్చితంగా ఎంతసేపు ఉంటుంది....తాగునీరు లేద కలుషిత నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా లేదా అన్నదానిపై కూడా పలువురు శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. కరోనా తాగునీరు, మురికి నీటిలో ఎంతసేపు బ్రతికి ఉంటుందన్నదానిపై తీవ్రంగా పరిశోధిస్తున్నారు. వారి పరిశోధనల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తాగునీటిని శుద్ధి చేసే యంత్రాలు కరోనా వైరస్ ను చంపగలవా లేదా అన్నదానిపై మరిన్ని పరిశోధనలు జరపాలని అమెరికా, నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మురుగు నీటిలో కరోనా వైరస్ ఉందని గుర్తించినట్టు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మైక్రోస్కోపిక్ వాటర్ డ్రాప్లెట్స్, ఏరోస్కోపిక్ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే, తాగునీరు, వాడుకునే నీటిని శుధ్ది చేసే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పారిశుధ్యం తక్కువగా ఉండి, నీటిని శుద్ధి చేయడంలో అధునాతన పధ్దతులను ఉపయోగించలేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సాయం చేయాలని, తద్వారా వారు పరిశుభ్రమైన నీటిని తాగి ..కరోనా బారిన పడకుండా ఉంటారని తెలిపారు. తాగునీటిని, మురుగునీటిని శుద్ధి చేసే యంత్రాలలో చాలా యంత్రాలు..కరోనా వంటి వైరస్ లను చంపుతాయని, అయితే నోవల్ కరోనా వైరస్ చాలా శక్తిమంతమైనది కాబట్టి దీనిని చంపగలవో లేవో పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పారు. వాటర్ ప్యూరిఫయ్యర్లు, మురికి నీటిని శుద్ధి చేసి రోజువారీ అవసరాలకు ఉపయోగించేలా మార్చే యంత్రాలలోని శుద్ధి చేసే విధానాలను పరిశీలించాలని చెప్పారు. కాగా, మురికి నీటిలో SARS-CoV-2 వైరస్ ఉన్నట్టు గుర్తించినట్టు నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు చెప్పారు. వేస్ట్ వాటర్ సర్వైలెన్స్ ద్వారా పొలియోవైరస్, యాంటీబయాటిక్ రిసిస్టెంట్ బ్యాక్టిరీయాలను గుర్తించేందుకు సమర్థవంతంగా పనిచేసే మెథడ్ ద్వారా దీనిని గుర్తించామన్నారు. మురికి నీటిలో కనిపించే వైరస్.. తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. జనాభాలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో పర్యవేక్షించేందుకు సున్నితమైన టూల్ గా పనిచేస్తుందని వారు చెప్పారు.