Begin typing your search above and press return to search.

ఆ సీఎంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోల్చుకుందామా?

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:27 AM GMT
ఆ సీఎంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోల్చుకుందామా?
X
చిన్న చిన్నవిషయాలే పెద్ద పెద్ద తేడాల్ని చూపిస్తుంటాయి. ఎందుకు చేస్తారో తెలీదు కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి పలుసందర్భాల్లో అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. ఆయన్ను అభిమానించే వారు సైతం నిజమే కదా? ఇలా చేసి ఉండకూడదన్న భావనకు గురయ్యేలా చేస్తుంటారు. తాజా వ్యవహారశైలి సీఎం కేసీఆర్ వైపు వేలెత్తేలా చేసిందని చెప్పాలి.

ఎవరైనా ప్రముఖుడు మరణిస్తే.. వెళ్లి పరామర్శించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించే తీరుపై తరచూ విమర్శలు వెల్లువెత్తి వస్తుంటాయి. ఒక ప్రముఖుడు మరణించినప్పుడు.. ఆయన వద్దకు వెళ్లటం.. కుటుంబ సభ్యుల్ని పరామర్శించటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అవేమీ పట్టనట్టుగా ఆయన తీరు ఉంటుంది. తరచూ తనను తాను గొప్పగా కీర్తించుకునే అలవాటున్నముఖ్యమంత్రి.. తన విషయంలో జరిగే తప్పుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

తాజాగా రెండు రోజుల వ్యవధిలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి.. తెలంగాణ రాష్ట్ర సీఎంకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థమయ్యే ఉదంతాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం చెన్నైలోని తన ఇంట్లో 26 ఏల్ల తూరిగై అనే యువతి ఆత్మహత్య చేసుకున్నారు.

ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ గీత రచయిత కపిలన్ కుమార్తె. కథా రచయిత.. సినీ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వ్యవహరించే ఆమె 'బీయింగ్ ఉమెన్' పేరుతో మ్యాగజైన్ నిర్వహిస్తోంది. అలాంటి ఆమెకు ఏ కష్టం వచ్చిందో తెలీదు కానీ.. సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ఫోన్ లోకపిలన్ ను పరామర్శించారు.

కట్ చేస్తే.. ఆదివారం ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ క్రష్ణంరాజు తుదిశ్వాస విడవటం తెలిసిందే. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను విషాదంలోకి ముంచెత్తింది. ఒక ప్రముఖుడి మరణం వేళ.. సాధారణంగాముఖ్యమంత్రి వెళ్లి నివాళులు అర్పించటం.. కుటుంబ సభ్యులను పరామర్శించటం చేస్తుంటారు.

సీఎం కేసీఆర్ మాత్రం అలాంటివేమీ చేయకపోవటం గమనార్హం. చివరకు ఫోన్ లోనూ మాట్లాడింది లేదు. పరామర్శించింది లేదు. తనను తాను తరచూ ఇతరులతో పోల్చుకునే ఆయన.. ఈ పరామర్శల విషయాన్ని ఎందుకు పట్టించుకోరు? ఆయనకు ఇలాంటివేమీ ఎందుకు పట్టవు? అన్నది ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.